అష్టాచమ్మా సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన నాచురల్ స్టార్ నాని, తొలిసినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు. నిజానికికి మొదట్లో టాలీవుడ్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చిన నాని, ఆ తరువాత ఇంద్రగంటి మోహన కృష్ణతో మంచి అనుబంధం కారణంగా ఆయన దర్శకత్వంలో అష్టాచమ్మా సినిమా చేయడం, అనూహ్యంగా అది సక్సెస్ కావడం జరిగింది. ఇక ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా తన టాలెంట్ తో అవకాశాలు అందుకుని ముందుకు సాగుతున్న నాని, ప్రస్తుతం మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు. ఇక ఇటీవల మాత్రం ఆయనకు ఊహించిన రేంజ్ లో సక్సెస్ లు అయితే రావడం లేదనే చెప్పాలి. 

 

కొద్దిరోజుల క్రితం ఆయన నటించిన జెర్సీ సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం పెద్దగా కలెక్షన్ రాబట్టలేకపోయింది. అనంతరం వచ్చిన గ్యాంగ్ లీడర్ అయితే ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఇక ప్రస్తుతం సుధీర్ బాబు తో కలిసి నాని నటిస్తున్న డిఫరెంట్ జానర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వి. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ద్వారా తొలిసారిగా నాని విలన్ గా అవతారం ఎత్తుతున్నారు. 

 

ఇక నేడు వి సినిమాలో రాక్షసుడిగా నటిస్తున్న నాని లుక్ బయటకు వచ్చి ప్రేక్షకులు, ఫ్యాన్స్ నుండి మంచి స్పందనను రాబట్టింది. నిజానికి ప్రస్తుతం హీరోగా మంచి అవకాశాలతో కొనసాగుతున్న నాని, ఇలా సడన్ గా విలన్ పాత్రలో నటించడానికి ఆ సినిమాలోని పాత్ర కారణం అని, అది తనకు నచ్చడం వల్లనే ఆయన ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారని సమాచారం. అయితే ఇప్పటివరకు హీరోగా పలు సక్సెస్ లు అందుకున్న నాని, తొలిసారిగా విలన్ గా ప్రేక్షకుల నుండి ఎటువంటి స్పందనను సంపాదిస్తారో చూడాలి. కాగా వి సినిమా మార్చి 25న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: