సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయంటే పుంజులు తలపడుతున్నట్టే ఉంటుంది వ్యవహారం. ఈ సంక్రాంతికి ఆ విషయాన్ని మరింత గట్టిగా నిరూపించారు బన్నీ – మహేశ్. కోడిపుంజులు తలపడినట్టే తలపడ్డారు ఇద్దరూ. గెలుపోటముల గురించి పక్కనపెడితే వచ్చే సంక్రాంతికి కూడా ఇలాంటి పోటీనే ఉండే అవకాశం ఉంది. దీంతో ఏడాదికి సమయముండగానే వచ్చే సంక్రాంతికి ఏఏ సినిమాలు రాబోతున్నాయో ఇప్పటి నుంచే ఓ లెక్కకు వచ్చేస్తున్నారు. ఈలెక్కన వచ్చే సంక్రాంతికి రాబోయే స్టార్ హీరోలను పరిశీలిస్తే..

 

 

వచ్చే సంక్రాంతికి కూడా బన్నీ, మహేశ్ లే వస్తారని అంచనా వేశారు. కానీ మహేశ్ మోకాలి ఆపరేషన్ చేయించుకున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ సినిమా ప్రారంభమే ఆలస్యం కావొచ్చు. కాబట్టి మహేశ్ ఈసారి సంక్రాంతి బరిలో ఉండకపోవచ్చు. పవన్ తన సినిమాలను వేగంగా పూర్తి చేయాలని కండీషన్ పెట్టాడంటున్నారు. దీంతో ఆయన సినిమాలు కూడా సంక్రాంతికి వచ్చే అవకాశాలు లేవు. బన్నీ సినిమా ఇప్పటికే మొదలైంది. సుకుమార్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వచ్చే బన్నీని వచ్చే సంక్రాంతికి బరిలోకి దింపుతాడని భావిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తవడంతోనే త్రివిక్రమ్ సినిమా చేస్తాడని అంటున్నారు. మే నెలకు ముందే షూటింగ్ పూర్తైతే మాత్రం త్రివిక్రమ్ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.

 

 

రామ్ చరణ్ సినిమా ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు కాబట్టి సంక్రాంతికి వచ్చే అవకాశం లేదు. ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతుందో లేదో తెలీదు. పైగా పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆలస్యం కావొచ్చు. ప్రభాస్ త్వరగా సెట్స్ పైకి వెళితే జాన్ సంక్రాంతికి వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ ఈక్వేషన్స్ అన్నీ చూస్తే వచ్చే సంక్రాంతికి బన్నీ, ఎన్టీఆర్ లు రావొచ్చు అని అంచనా వేస్తున్నారు. మరి వచ్చే సంక్రాంతి పుంజులు ఎవరో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: