రజినీకాంత్ మాస్ హీరో... అంతకు మించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ఆరాధ్యదైవం.  ఆయన సినిమా అంటే ప్రేక్షకులు పడి చచ్చిపోతారు. ఒక్క సినిమా రిలీజైతే చాలు ప్రేక్షకులు ఆయనకు బ్రహ్మరధం పడుతుంటారు.  రజినీకాంత్ సినిమా రిలీజ్ రోజున తమిళనాడులో చాలా సంస్థలకు సెలవులు కూడా ఇస్తుంటారు.  సినిమా  హిట్టయిందా ఇక చెప్పాల్సిన అవసరం లేదు.  


మాస్ కా బాప్ అనేలా సినిమాలు తీస్తుంటారు.  అయితే, గత కొంతకాలంగా సినిమాల విషయంలో ఇబ్బందులు పడుతున్న రజినీకాంత్ దర్బార్ సినిమాతో మరలా ట్రాక్ లోకి వచ్చారు.  దర్బార్ సినిమా మంచి విజయం సాధించింది.  అనేక చోట్ల ఈ సినిమా బ్రేక్  ఈవెన్ అయ్యి రికార్డులు సృష్టిస్తోంది.  సినిమా సినిమాకు రజినీకాంత్ మంచి పరిణితి చెందుతున్నాడు.  ఇక ఇదిలా ఉంటె, రజినీకాంత్ సినిమాలు ఎలా ఉంటాయి... ఎందుకు హిట్ అవుతుంటాయి అనే విషయాలు ప్రేక్షకులు ఇప్పటికి చెప్పలేరు.  


అంతెందుకు రజినీకాంత్ కూడా ఓ సందర్భంలో తన సినిమాల గురించి చెప్పిన విషయాలు  అందరికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  తాను విలన్ కావాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొన్ని  సినిమాల్లో విలన్ గా చేశానని, తరువాత విలన్ గా కాకుండా హీరోగా అవకాశాలు వచ్చాయని చెప్పారు.  ఇలా అవకాశాలు రావడం నిజంగా అదృష్టం అని రజిని చెప్పడం విశేషం.  70 ఏళ్ల వయసులో కూడా రజినీకాంత్ కుర్రోడిలా సాహసాలు చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు.  


ఇటీవలే బ్రిటిష్ సాహసికుడు బేర్ గ్రిల్స్ తో  కలిసి బందీపూర్ రిజర్వ్ ఫారెస్ట్ లో సాహసయాత్ర చేశాడు.  గతంలో మోడీతో కలిసి బేర్ గ్రిల్స్ ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ ఫారెస్ట్ లో ఈ సాసహం చేశారు.  ఇప్పుడు రజినీకాంత్ తో చేయడం విశేషం.  మోడీ తరువాత ఆ అదృష్టం రజినీకాంత్ కు లభించింది.  అయితే, రజినీకాంత్ వయసురీత్యా పెద్ద కావడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.  స్వల్పగాయాలయినట్టు తెలుస్తోంది.  ఈ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: