సన్నీలియోన్ గురించి ఆరేళ్ళ చిన్నోడి నుంచి అరవై ఏళ్ల పడుచోడి వరకు బాగా తెలుసు.  అరవై ఏళ్ల పడుచోడు అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, ఆ వయసులో కూడా సన్నీ లియోన్ ను చూస్తే చొంగ కార్చుకునే వ్యక్తులు  కోకొల్లలుగా ఉన్నారు.  అందులో అలా అనాల్సి వచ్చింది.  పెద్దల సినిమా రంగంలో మంచి పాపులర్ అయిన సన్నీ, ఆ తరువాత అదే స్థాయిలో విజయం సాధించింది.  భారీ సినిమాలు చేసింది. 


బాలీవుడ్ రంగంలోకి అడుగుపెట్టి, మొదట్లో ఛీత్కారాలు పొందినా, తరువాత అవార్డులు, గౌరవ మర్యాదలు దక్కించుకుంది.  పెద్ద పెద్ద స్టార్స్ సైతం సన్నీలియోన్ తో సినిమాలు చేయడానికి ఇటీవల ఆసక్తి చూపుతున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు ఆమె టాలెంట్ ఎలాంటిదో.  ఏ రంగం నుంచి వచ్చామన్నది కాకుండా, ఇప్పుడున్న రంగంలో ఎలా రాణిస్తున్నాము అన్నది ముఖ్యం.

 
ఇక ఇదిలా ఉంటె, సినిమా రంగంలో అద్భుతమైన విజయాలు అందుకుంటున్న సన్నీలియోన్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి సౌందర్య ఉత్పత్తులను అమ్ముకుంటూ డబ్బు సంపాదిస్తోంది.  స్టార్ స్టక్ ఉత్పత్తులకు ఆమె బ్రాండ్ అంబాసిసర్ గా ఉంటోంది.  ఇక ఇదిలా ఉంటె, ఇటీవలే నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టింది ఈ అమ్మడు.  షార్ట్ మూవీస్ కు ప్రొడ్యూస్ చేసిన సన్నీలియోన్ ఇప్పుడు ఏకంగా సినిమాలు ప్రొడ్యూస్ చేసేందుకు రెడీ అయ్యింది. 


రీసెంట్ గా ఓ మూవీని  స్టార్ట్ చేశారు.  ప్రొడక్షన్ మొత్తం భర్త వెబర్ చూసుకుంటున్నాడట.  ఫిక్షన్, థ్రిల్లర్ సినిమాను నిర్మిస్తోంది.   కథ, నిర్మాణం రెండు తమ సంస్థ నుంచే వస్తుండటంతో చాలా ఆనందంగా ఉందని, సొంతంగా సినిమా చేస్తున్నా, సెట్స్ టీ అందించడం తనకు చాలా హ్యాపీగా ఉందని అంటోంది.  నిర్మాతగా మొదటి సినిమా కావడంతో అన్ని దగ్గరుండి చూసుకుంటోంది.  సినిమా విజయం సాధిస్తే, అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: