ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో న్యాచురల్ స్టార్ నాని గతంలో జెంటిల్ మాన్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. నివేదా థామస్, సురభి హీరోయిన్స్ గా నటించగా నాని డ్యూయల్ రోల్ లో నటించాడు. ఈ సినిమా నానికి మంచి క్రేజ్ ని ఇమేజ్ ని తీసుకు వచ్చింది. ఇక తాజా నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సినిమా 'వ్'. ఈ సినిమాలో సుధీర్ బాబు.. నాని పాత్రల ఫస్ట్ లుక్స్ ను ఇప్పటికే విడుదల చేశారు. సుధీర్ బాబును 'రక్షకుడు' అని.. నానిని 'రాక్షసుడు' అని పరిచయం చేశారు. ఇది మొదటి నుంచి ప్రచారంలో ఉన్న విషయమే. నాని ఈ సినిమాలో మొదటి సారిగా విలన్ పాత్రలో నటిస్తున్నారని.. సుధీర్ బాబు హీరో అని అన్నారు. సినిమా ప్రమోషన్స్ కూడా దీనికి సంబందించినట్టే చేస్తున్నారు.

 

అయితే ఇదంతా కాదని ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నాని విలన్.. సుధీర్  హీరో అనే మాట అసలు నిజం కాదని ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు దిల్ రాజు టీమ్.. డైరెక్టర్ ఇంద్రగంటి కలిసి ఇలా స్పెషల్ గా పబ్లిసిటీ ప్లాన్ చేశారట. నిజానికి ఈ సినిమాలో నాని.. సుధీర్ పాత్రలు రివర్స్ లో ఉంటాయని తాజా సమాచారం. క్లారిటీగా చెప్పాలంటే నాని మొదట్లో విలన్ లాగా కనిపించినా చివరికి హీరోగా మారతాడని.. సుధీర్ మొదట్లో హీరోగా కనిపించినా క్లైమాక్స్ వచ్చేసరికి విలన్ గా మారిపోతాడని అంటున్నారు.

 

ఇలా అయితే ఈ సినిమాలో ఎవరూ హీరో కాదు.. ఎవరూ విలన్ కాదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏదైతేనేం.. ఈ సినిమాలో నాని.. సుధీర్ ఇద్దరూ తమ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారని మాత్రం అర్థం అవుతోంది. మరి ఈ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్లు ప్రేక్షకులకు ఎంతమాత్రం నచ్చుతాయో చూడాలి. ఇంతకముందు నాని జెంటిల్ మాన్ లో కూడా మొదట్లో నెగిటివ్ గా ఉన్న నాని క్యారెక్టర్ తర్వాత పాజిటివ్ గా మారిపోతోంది. దీన్ని బట్టి చూస్తే ఇంద్రగంటి మరో సారి అదే ఫార్మాట్ లో ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా నివేదా థామస్, అదితీ రావు హైదరి నస్టిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: