స‌న్నీలియోన్ ఈ పేరు వింటే చాలు కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుడుతుంది. శృంగార తార‌గా కెరియ‌ర్‌ని మొద‌లు పెట్టిన ఈ భామ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో మంచి మంచి పాత్ర‌ల్లో న‌టిస్తూ ఎంతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సాధించింది. ప్ర‌స్తుతం ఈ భామ నిర్మాత‌గా అవ‌తార‌మెత్త‌నుంద‌ని స‌మాచారం. ఒక‌ప‌క్క  సినిమాల్లో న‌టిస్తూనే మ‌రో ప‌క్క వెబ్‌సిరీతో బిజీ అయిన‌ప్ప‌టికీ... కొత్తగా సినిమాల‌ను నిర్మించాల‌నే బాధ్య‌త‌ను ఈ భామ నెత్తిమీద వేసుకుంది. ఇప్ప‌టికే బాలీవుడ్‌లో చాలా మంది ప్ర‌ముఖులు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ హాట్ భామ కూడా అదే బాట ప‌ట్టింది. 

 

ఇక ఈ కొత్త‌గా పెట్ట‌బోయే ప్రొడ‌క్ష‌న్ హౌస్‌కి సంబంధించిన ప‌నుల‌న్నీ త‌న భ‌ర్త డేనియ‌ల్ వేబ‌ర్ చూసుకుంటార‌ని స‌న్నీ చెప్పుకొచ్చింది.  సినిమాకు కావలసిన బడ్జెట్, కథ మన అధీనంలో ఉన్నప్పుడు ఎవరినీ నిందించాల్సిన అవసరం ఉండదంటూ స‌న్నీ అభిప్రాయ ప‌డుతుంది.  తమ చిత్రం ఈ ఏడాది సెట్స్ మీదకు వెళుతుందని చెబుతూ.. నిర్మాణ బాధ్యతలు కొత్త అయినప్పటికీ.. తనకు చాలా ఉత్సాహంగా ఉందంటుంది.

 

త‌ను మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీయ‌డం లేదంటూ కేవ‌లం ఒక ఫిక్ష‌న్ అండ్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ని తెర కెక్కిస్తున్న‌ట్లు తెలిపింది. అలాగే నిర్మాత‌గా అయినా కూడా ఎలాంటి ఇగో ఫీలింగ్స్ నీకు ఉండ‌వంటుంది ఈ భామ‌. సినిమా సెట్‌లో ఏ ప‌ని చేయ‌మ‌న్నా నేను రెఢీ అంటుంది. ఆఖ‌రికి సెట్‌లో టీ అందించ‌డానికైనా వెన‌కాడ‌నంటోంది. ప్ర‌తి ఒక్క‌రిని నేను స‌మానంగానే చూస్తానంటుంది. ఇక ఈ భామ తెలుగులో కూడా ఐటెమ్ సాంగ్స్‌తో ఒక ఊపు ఊపేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం స‌న్నీ వీర‌మాదేవి చిత్రంతో బిజీగా ఉన్నారు.  వరుస సినిమాలు వీలు చిక్కినప్పుడల్లా ప్రత్యేక గీతాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించింది ఈ భామ‌. ఇక నిర్మాత‌గా ఈమె ఎలాంటి చిత్రాలు తెర‌కెక్కించ‌బోతుంది. అలాగే ఎంత వ‌ర‌కు ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: