యవ్వనం అనేది ఐస్ క్రీం లాంటింది. కరిగిపోక ముందే వాడాలి. అది కరుగుతుండగా చూద్దామంటే పుల్లే మిగులుతుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే. ఈ కాలంలో సినిమా రంగంలోకి వచ్చే హీరోయిన్స్ అంతా దాదాపుగా కుర్రభామలే. మన టాప్ హీరోలేమో ఐస్ క్రీం పుల్లల్లా మిగిలారు. అంటే వయస్సు అయిపోతుంది కదా.. మరి ఇలాంటి టైంలో టన్నుల కొద్ది మెకప్ వేసి వారి వయస్సుని ఎలాగో తెరపై కవర్ చేయవచ్చూ. కాని ప్రేక్షకులు అంత వెర్రి వెంగళప్పలు కాదుగా, అందులో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కొన్ని కొన్ని విషయాల్లో ఊసర వెల్లిలా ముదిరిపోయారు..

 

 

అందుకే ఇప్పుడున్న ఈ హీరోలకు తమ వయస్సు హీరోయిన్స్ దొరకడం గఘనం అయ్యిందట.  అసలు ఇప్పుడున్న పరిస్దితుల్లో సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం చాలా కష్టమైపోతోంది. ఇకపోతే తెలుగు ఇండస్ట్రీ విషయానికొస్తే ప్రస్తుతం నలుగురు సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున.. ఈ హీరోలు గత కొంతకాలంగా హీరోయిన్ల కోసం ఇబ్బంది పడుతున్నారట. అంతే కాకుండా ఎలాగోలా  ఒప్పించుకుని యంగ్ హీరోయిన్లతో జట్టు కడుతుంటే విమర్శలు, సుడిగాలిలా చుట్టేస్తున్నాయట. తాజాగా మన్మథుడు 2 విషయంలో రకుల్ తో రొమాన్స్ చేసినందుకు నాగ్ కు ఇదే అనుభవం ఎదురైంది.. అందుకే చేసేదేం లేక సీనియర్ హీరోలు ఫేడౌట్ హీరోయిన్ల వైపు చూస్తున్నారు.

 

 

అదీ కాకుండా కుర్ర హీరోలకు సరిపడా భామలున్న ఈ రంగంలో సీనియర్ హీరోల పరిస్దితి, ఓ ముగ్గురు నలుగురు ముద్దు, బొద్దు గుమ్మలతో నెట్టుకు రావలసి వస్తుంది. అందులో నయనతార, అనుష్క లాంటి వాళ్ళు తప్ప సీనియర్ హీరోల పక్కన సూట్ అయ్యే కథానాయికలు దొరకట్లేదు. అనుష్క చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఇకపోతే బాలకృష్ణ గత కొంత కాలంగా హీరోయిన్ల కోసం ఇబ్బంది పడుతున్నాడు.

 

 

ఎన్టీఆర్ సినిమా కోసం భారీ పారితోషికం ఆఫర్ చేసి విద్యా బాలన్ ను తీసుకున్నారు. రూలర్ కు అది కుదరక ఫేడౌట్ అయిపోయిన వేదిక, సోనాల్ చౌహన్ లను పట్టుకొచ్చారు. ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమాకు ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు. అంతే కాదు ప్రస్తుతం. చిరంజీవి, త్రిష తో, వెంకటేష్ ప్రియమణితో వెళ్తున్నాడు. ఇక నాగార్జున బాలీవుడ్ లో కూడా ఫేడ్ అవుట్ అయిన దియా మీర్జాను దింపాల్సి వచ్చింది. ఇలా సీనియర్ హీరోలకు హీరోయిన్ల విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాగైతే ఇక ముందు ముందు వీరు హీరోల పాత్రల్లో కనుమరుగు అయినా ఆశ్చర్యం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: