మెగా బ్రదర్ నాగబాబు మళ్లీ జబర్దస్త్ లోకి వస్తారా.. జబర్దస్త్ నుండి బయటకు వెళ్లిన ఆయన జీ తెలుగులో అదిరింది షో జడ్జ్ గా చేస్తున్నారు. సేం టూ సేం జబర్దస్త్ లానే అదిరింది షో ప్లాన్ చేశారు. జబర్దస్త్ స్టార్ట్ కంటెస్టంట్స్ చమ్మక్ చంద్ర, ఆర్పి లు అదిరింది షోకి వెళ్లారు. అక్కడ వారికి భారీ పారితోషికం ఇస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు నాగబాబుకి అదిరింది షో ద్వారా బాగా వర్క్ అవుట్ అయినట్టు అంటున్నారు. ఇదిలాఉంటే ఎన్నో భారీ అంచనాలతో మొదలైన అదిరింది షో మొదట్లోనే ఢీలా పడ్డది. షోకి పెడుతున్న ఖర్చుకి అది తెచ్చుకునే రేటింగ్స్ కు ఏమాత్రం సంబంధం ఉండటం లేదట.

 

అందుకే అదిరింది షోని ఆపేయాలని చూస్తున్నారట జీ తెలుగు టీం. అంతేకాదు నాగబాబు మళ్లీ జబర్దస్త్ కు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అదిరింది షో సక్సెస్ అయితే సీన్ ఎలా ఉండేదో కాని ఎందుకో జబర్దస్త్ చూసిన ఆడియెన్స్ అదిరింది షోని ఓన్ చేసుకోలేకపోతున్నారు. అంతేకాదు ఆ యాంకర్ సమీరా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇక జడ్జ్ గా నాగబాబు పక్కన నవదీప్ పెద్దగా ఇంప్రెస్ చేయట్లేదు. ఇవన్ని అదిరింది షోకి మైనస్ లుగా చెప్పుకుంటున్నారు. అయితే నాగబాబు సింగిల్ హ్యాండ్ తో షోని నడిపించే సత్తా ఉన్నా రేటింగులు చూసి ఖంగు తినే పరిస్థితి వచ్చింది.

 

ఇక ఈ క్రమంలో జబర్దస్త్ స్టార్ కంటెస్టంట్ అయిన గెటప్ శ్రీను ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ చేశాడు. నాగబాబు జబర్దస్త్ నుండి బయటకు వెళ్లడం దురదృష్టమని చెప్పిన గెటప్ శ్రీను మళ్లీ నాగబాబు జబర్దస్త్ కు వస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. త్వరలో మళ్లీ నాగబాబు జబర్దస్త్ కు వస్తున్నట్టుగా సీక్రెట్ లీక్ చేశాడు. ఇదే జరిగితే జబర్దస్త్ కు మళ్లీ పూర్వ వైభవం వచ్చినట్టే. ప్రస్తుతం జబర్దస్త్ షోని రోజా జడ్జ్ గా నడిపిస్తున్నారు. వారానికో గెస్ట్ వస్తున్నా సరే నాగబాబు లేని వెళ్తి కనబడుతూనే ఉంది. మరి నిజంగానే నాగబాబు మళ్లీ జబర్దస్త్ కు వస్తారా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: