తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్లు దొర‌క‌డం చాలా క‌ష్ట‌మ‌యిపోయింది. ఒక‌ప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీకి నాలుగు స్థంబాల్లా ఉండే చిరంజీవి, వెంక‌టేష్‌, బాల‌కృష్ణ‌, నాగార్జున హీరోయిన్ల కోసం చాలా ఇబ్బందులు ప‌డుతున్నారా... వాళ్ళ‌కి హీరోయిన్ల‌ను వెతికేత‌ట‌ప్ప‌టికి ద‌ర్శ‌కుల‌కు త‌ల‌ప్రాణం తోక‌కి వ‌స్తుంద‌ని... ఇదెక్క‌డి గోలండి బాబు. అవును ఇది నిజ‌మే. వీళ్ళ న‌లుగురికి హీరోయిన్లు దొర‌క‌డం చాలా క‌ష్ట‌మ‌యిపోయింది. ఈ హీరోల‌కు క‌థ‌లు, ద‌ర్శ‌కులు, ఇక నిర్మాత‌లు కూడా దొరుకుతున్నారు కానీ హీరోయిన్ల కొర‌త మాత్రం బాగా పెరిగిపోయింది.  వీళ్ళ వ‌య‌సుకు ప్ర‌స్తుతం వ‌చ్చే యంగ్ హీరోయిన్ల‌తో న‌టిస్తుంటే సోష‌ల్ మీడియాలో వ‌చ్చే కామెంట్ల‌తో త‌ల ప‌ట్టుకుంటున్నారు. 

 

మన్మథుడు 2 విషయంలో రకుల్ తో రొమాన్స్ చేసినందుకు నాగ్ కు వ‌చ్చిన విమ‌ర్శ‌లు మామూలు కాదు.  ఇక ఏమీ చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఫ్లాప్ హీరోయిన్ల వెంట ప‌డుతున్నారు. ఈ హీరోలు. ప్ర‌స్తుతం వాళ్ళ‌కి ఆప్ష‌న్స్ చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. దీంతో త్రిష‌, న‌య‌న‌తార‌, అనుష్క లాంటి వారు త‌ప్పించి వీరికి వేసే ఆప్ష‌న్స్ దొర‌క‌డం లేదు. ఇక అనుష్క ఈ మ‌ధ్య కాస్త సినిమాల‌కు దూర‌మ‌య్యారు. ఆమె వెయిట్ గెయిన్ అవ్వ‌డంతో చాలా గ్యాప్ వ‌చ్చింది. ఇక బాల‌య్య కూడా గత కొంత కాలంగా హీరోయిన్ల కోసం ఇబ్బంది పడుతున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ సినిమా కోసం భారీ పారితోషికం ఆఫర్ చేసి విద్యా బాలన్ ను తీసుకున్నారు. ఇక రూలర్ విష‌యానికి వ‌చ్చేస‌రికి ఏమి చెయ్యాలో అర్ధం కాక‌  ఫేడౌట్ అయిపోయిన వేదిక, సోనాల్ చౌహన్ లను తీసుకొచ్చారు. ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమాకు ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు.

 

చిరంజీవి కొర‌టాల‌ సినిమాకు  త్రిషను హీరోయిన్‌గా తీసుకుంటే.  వెంకటేష్ నార‌ప్ప‌లో ప్రియమణితో చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. నాగార్జున బాలీవుడ్ లో కూడా ఫేడ్ అవుట్ అయిన దియా మీర్జాను దింపాల్సి వచ్చింది. ఇలా సీనియర్ హీరోలకు హీరోయిన్ల విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే ఆఖ‌రికి త‌మ‌న్నా, కాజ‌ల్ లాంటి వారిని కూడా మ‌ధ్య మ‌ధ్య‌లో వీళ్ళ ప‌క్క‌న క‌థానాయిక‌లుగా పెట్టుకున్న‌ప్ప‌టికీ కొర‌త చాలానే ఉంద‌ని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: