‘నాపేరు సూర్య’ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ప్రస్తుతం వక్కంతం వంశీ పేరు కూడ ఎక్కడా వినిపించడంలేదు. రచయితగా ఎంట్రీ ఇచ్చిన వంశీకి దర్శకుడుగా మారిపోవాలని ఏర్పడిన కోరికకు అల్లు అర్జున్ ఇచ్చిన ప్రోత్సాహంతో అతడు ‘నాపేరు సూర్య’ మూవీని తీయగలిగాడు.

మూవీ ఫ్లాప్ అయినా బన్నీకి వంశీ పై అభిమానం కొనసాగుతూనే ఉంది. దీనితో తమ సొంత బ్యానర్ లో వరుణ్ తేజ్ తో ఒక సినిమాను చేసే అవకాశం వంశీకి ఇప్పించడానికి చాల రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సస్ కు పరోక్షంగా వక్కంతం వంశీ కారకుడు అన్న అర్ధం వచ్చేలా బన్నీ ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ చాల మందికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. 

‘నాపేరు సూర్య’ షూటింగ్ సమయంలో తన తదుపరి సినిమా ఎవరితో చేయాలి అన్న చర్చలు జరుగుతున్నప్పుడు వంశీ బన్నీని త్రివిక్రమ్ తోనే తన తదుపరి సినిమాను చేయమని సలహా ఇచ్చినట్లు బన్నీ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అప్పటికే తాను త్రివిక్రమ్ తో రెండు సినిమాలు చేయడంతో తాను కన్ఫ్యూజ్ అవుతున్న విషయాన్ని గ్రహించిన వక్కంతం ఈసారి తాను త్రివిక్రమ్ తో చేయబోయే మూవీ చరిత్ర సృష్టిస్తుంది అంటూ వక్కంతం ఊహించాడు అంటూ బన్నీ చెపుతున్నాడు. 

అయితే తాను సినిమా మొదటి సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో నచ్చదో తెలియక ఫ్లాప్ ను అందుకున్న వంశీ ఏకంగా త్రివిక్రమ్ మూవీ బ్లాక్ బష్టర్ అవుతుందని ముందుగానే ఊహించడం యాధృశ్చికం అనుకోవాలి. ఇది ఇలా కొనసాగుతూ ఉంటే ‘అల వైకుంఠపురములో’ సూపర్ సక్సస్ తో బన్నీకి పారితోషికంగా 24 కోట్లు ఈ సినిమా లాభాలలో షేర్ గా అరవింద్ కు 40 శాతం వాటాగా 16 కోట్లు రావడంతో అల్లు కుటుంబానికి 40 కోట్లు ‘అల’ తెచ్చి పెట్టింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: