తెలుగు లో 80వ దశకంలో హీరోగా నటించిన హీరోల్లో సుమన్ ఒకరు.  మార్షల్ ఆర్ట్ప్ లో పట్టా పుచ్చుకున్న సుమన్ మంచి అందగాడిగా అమ్మాయిల హృదయాల్లో చోటు సంపాదించారు. తెలుగు తెరకి 'ఇద్దరు కిలాడీలు' సినిమా ద్వారా హీరోగా పరిచయమైన సుమన్, 'తరంగిణి' సినిమాతో పాప్యులర్ అయ్యారు.  నటన పరంగా కూడా మంచి మార్కులు కొట్టేశాడు.  హీరోగా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో కొన్ని ఇబ్బందుల వల్ల కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు.  తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన మంచి విజయాలు అందుకున్నాడు.  ఆ తర్వాత క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ వచ్చారు. 

 

హీరోగా స్టార్ ఇమేజ్ సంపాదించిన సుమన్ తర్వాత కాలంలో విలన్ అవతారం ఎత్తారు.  సుమన్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'శివాజీ' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆయన రజనీని ఢీ కొట్టే విలన్ గా నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ బిగినింగ్ లో తాను తమిళ సినిమాల్లో నటించినా.. తర్వాత తెలుగులోనే స్థిరపడ్డానని అన్నారు. తమిళ చిత్ర పరిశ్రమకి దూరమై చాలాకాలం అయింది .. అక్కడ ఒక సినిమా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్న సమయంలోనే, దర్శకుడు శంకర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది.

 

పెద్ద బ్యానర్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్.. ఇక హీరో సూపర్ స్టార్ రజినీకాంత్.. అన్నీ బాగున్నాయి.. నో ఎలా చెబుతాం ఓకే అన్నాను.  ఆ తర్వాత నాకు రజినీకాంత్ ఫోన్ చేశారు.. మీరు మంచి హీరో.. ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నందుకు మీరేం ఫీల్ కావడం లేదు గదా?  అని రజనీ అడిగారు.  స్వయంగా ఆయనే ఫోన్ చేసి మాట్లాడటంతో..  అలాంటిదేమీ లేదు సార్ .. మీ ఆశీస్సులు కావాలని చేశాను  అన్నాను. ఈ సినిమాలో విలన్ గా నాకు మంచి పేరు వచ్చింది.. తర్వాత కూడా మంచి ఛాన్సులు వచ్చాయని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: