‘నర్తనశాల’ ఘోర పరాజయం తరువాత ‘ఓ బేబి’ సినిమాలో నటించి మెప్పించినా ఆ ఘనత అంతా సమంత ఎకౌంట్ లోకి వెళ్ళిపోయింది. దీనితో నాగశౌర్య మళ్ళీ నిర్మాతగా చేసి తానే స్వయంగా కథ వ్రాసి హీరోగా నటిస్తున్న ‘అశ్వద్ధామ’ మూవీ పై చాల అంచనాలు పెట్టుకుని ఈ మూవీని చాల భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నాడు.

ఈ వారం విడుదల కాబోతున్న ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే సంక్రాంతి సినిమాల మ్యానియా నుండి తేరుకుని సగటు ప్రేక్షకుడు మిగతా సినిమాలు చూసే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఇలాంటి పరిస్థుతులలో నాగశౌర్య తన ఇంటర్వ్యూలో ఒక ఆశ్చర్యమైన విషయం బయట పెట్టాడు. 

ఒక ఇంటిలో ఎవరైనా చనిపోయినప్పుడు ఏర్పడే మౌనం బాధ తన ఇంటిలో ఎటువంటి అశుభం జరగకుండా ఆరు నెలలో అనుభవించిన విషయాన్ని బయట పెట్టాడు. ‘నర్తనశాల’ మూవీ ఘోర పరాజయంతో తమ కుటుంబానికి బాగా నష్టం వచ్చిందని అయితే అలాంటి సినిమా ఎందుకు చేసావు అని ఒక్క మాట కూడా అడగకుండా తన తల్లి మౌనంగా ఆరు నెలలు పాటు ఎటువంటి నవ్వు లేకుండా ఉండటం చూసి తన ఇంటిలో కొనసాగుతున్న శ్మసాన వాతావరణం చూసి భయపడిపోయిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.

అయితే ఇక నుంచి తాను ప్రయోగాలు చేయనని కేవలం సక్సస్ ఫార్మలా సినిమాలు మాత్రమే చేస్తాను అని ఈ యంగ్ హీరో అంటున్నాడు. ప్రస్తుతం తన వద్ద చాల కథలు ఉన్నాయని ఆ కథలను ఆ కథలను తన తోటి హీరోలకు తాను సిద్ధం అంటూ సంకేతాలు ఇస్తున్నాడు. అయితే కమర్షియల్ ఫార్మలా తో తీసిన చాల సినిమాలను కూడ సగటు ప్రేక్షకుడు రిజిట్ చేస్తున్న పరిస్థితులలో నాగశౌర్య స్నేహితుడు చెల్లెలకు జరిగిన వాస్తవ సంఘటను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీ సక్సస్ కావడం నాగశౌర్య కెరియర్ కు చాల అత్యంత కీలకం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: