అభిరుచిగల నిర్మాతగా రాజ్ కందుకూరికి మంచి పేరు ఉంది. ‘పెళ్ళిచూపులు’ సినిమాతో నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా విజయ్ దేవరకొండను క్రేజీ హీరోగా ‘పెళ్ళిచూపులు’ మార్చింది. 

ప్రస్తుతం వారసుల హవా కొనసాగుతున్న పరిస్థితులలో రాజ్ కందుకూరి కొడుకు శివ హీరోగా మార్చి ‘చూసీ చూడంగానే’ మూవీని నిర్మించి ఈ వారం విడుదల చేస్తున్నారు. శేష సింధు అనే యంగ్ మహిళా దర్శకురాలు ఈ మూవీ ద్వారా పరిచయం కాబోతోంది. తెలుగులో మహిళా దర్శకులు చాల తక్కువగా ఉన్న పరిస్థితులలో అంతా కొత్త వాళ్ళతో నిర్మిస్తున్న ఈ చిన్న సినిమా ఈ వారం ఏదైనా సంచలనం సృష్టిస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

తన సినిమాలో సినిమాల్లో అశ్లీలత డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవని చెపుతూ ఈమధ్య లిప్ లాక్స్ ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయని చాలామంది అనుకుంటున్నారని అయితే లిప్ లాక్ సీన్స్ తో విజయం రాదని ఈమధ్య విడుదలైన కొన్ని సినిమాలు రుజువు చేసిన విషయం పై కామెంట్ చేసాడు. దీనితో రాజ్ కందుకూరి కామెంట్లు చూస్తుంటే విజయ్ దేవరకొండను టార్గెట్ చేసేవిగా ఉన్నాయా అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.

‘పెళ్ళిచూపులు’ మూవీ తరువాత రాజ్ కందుకూరి విజయ్ దేవరకొండతో మరొక సినిమాను చేయాలని ప్రయత్నించాడు అని అంటారు. అయితే కొన్ని కారణాలు వల్ల ఆ ప్రాజెక్ట్ మొదలుకాలేదు. ఈమధ్య కాలంలో విజయ్ దేవరకొండ తాను నటించే ప్రతి సినిమాలో లిప్పులాకుల మోత మోగిస్తున్నాడు. కథకు అవసరం ఉన్నా లేకపోయినా లిప్పు లాకులు ఉండాలని విజయ్ డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా ఒక టాక్ ఉంది. ఈ విషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని రాజ్ కందుకూరి ఇలా కామెంట్ చేసి ఉంటాడు అని భావిస్తున్నా వీరిద్దరి మధ్య బయటకురాని ఎదో తెలియని గ్యాప్ ఉండటంతో రాజ్ కందుకూరి విజయ్ దేవరకొండ పేరు లేకుండా ఈ రకంగా కామెంట్ చేసి ఉంటాడు అన్న అభిప్రాయం ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: