ఇండస్ట్రీలో విజయం అనేది చాలా అవసరం. సక్సెస్ లేకపోతే ఎంతటి ప్రతిభ ఉన్నా పక్కన పెట్టేస్తుంటారు. ఎంతో మంది నటులు ప్రతిభ ఉన్నా కూడా సక్సెస్ లేక కెరీర్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ సక్సెస్ అనేది హీరోయిన్లకి మరీ అవసరం. సెంటిమెంట్లతో నడిచే ఇండస్ట్రీలో హీరోయిన్ ఉన్న సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటే, సెంటిమెంట్ కింద జమ కట్టేసి వాళ్ళని తీసుకోవడం మానేస్తారు.

 

 

అందుకే ఇండస్ట్రీలో టాలెంట్ ఎంత ఉన్నా అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే ఆ అదృష్టం పాళ్ళు చాలా తక్కువ ఉన్న హీరోయిన్ మెహరీన్. క్రిష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగులోకి ప్రవేశించిన ఈ అమ్మడుకి ఆ తర్వాత పెద్దగా చెప్పుకోవాల్సిన హిట్లు పడలేదు. ఎఫ్ 2, రాజా ది గ్రేట్  ని మినహాయిస్తే మెహ్రీన్ కెరీర్లో విజయాలే లేవు. మొన్నటికి మొన్న వచ్చిన ఎంత మంచివాడవురా చిత్రం కూడా పరాజయం పాలైంది.

 

 

దీంతో ఈ అమ్మడు కెరీర్ మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈమె చేతిలో సినిమాలేమీ లేవు. ప్రస్తుతం చేసిన అశ్వద్ధామ సినిమా మీదే నమ్మకం పెట్టుకుంది. నాగశౌర్య హీరోగా నటించిన ఈ చిత్రం మీద అంచనాలు బాగానే ఉన్నాయి. టీజర్, ట్రైలర్ లని చూస్తుంటే ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. అదీ కాకుండా నాగశౌర్య ఈ కథని స్వయంగా రాశాడు. దాంతో మరింత జాగ్రత్తగా ఈ సినిమాని చేశాడు.

 

 

మరి మెహ్రీన్ నమ్మినట్టుగా, ఈ సినిమా విజయవంతం అయ్యి ఆమె కెరీర్ చక్కబడుతుందా లేదా చూడాలి. అటు తమిళ్ లోనూ మెహరీన్ కెరీర్ సేమ్ ఫేజ్ లో ఉంది. ఇటీవలే ధనుష్ తో కలిసి నటించిన పటాస్ రిలీజైంది. అది సక్సెసైనా ఇంకో కొత్త సినిమాకు కమిట్ అయినట్లు ఎక్కడా ప్రచారమే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: