ఇప్పటివరకు రాజకీయాలలో హడావిడి చేసిన పవన్ మళ్ళీ యూటర్న్ తీసుకుని సినిమాలలో నటిస్తున్న పరిస్థితులలో పవన్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం పవన్ చేస్తున్నది రెండు పడవల ప్రయాణం కాదు మూడు పడవల ప్రయాణం అంటూ సెటైర్లు పేలుతున్నాయి. 

దీనికి కారణం పవన్ రెండు సినిమాలలో ఒకేసారి ఒకే సమయంలో నటిస్తూ ఉండటం. పవన్ ఇప్పటి వరకు 25 సినిమాలలో నటించినా ఇలాంటి ప్రయోగం పవన్ ఎప్పుడు చేయలేదు. ఇలా వేగంగా పవన్ సినిమాలు చేయగలిగి ఉంటే ఇప్పటికే పవన్ నటించిన సినిమాల సంఖ్య 50 దాటిపోయి ఉండేది. ‘

‘పింక్‌’ రీమేక్‌ షూటింగ్‌ ఇటీవలే మొదలు పెట్టిన సందర్భంలో పవన్‌కళ్యాణ్‌ రేపటి నుంచి క్రిష్‌ సినిమా కూడా స్టార్ట్‌ చేస్తున్నాడు. పీరియాడిక్ మూవీగా నటించబోయే ఈ మూవీ కథ పవన్ భావజాలానికి చాల దగ్గరలో ఉంటుంది అని అంటున్నారు. వాస్తవానికి ఈ సినిమాను ‘పింక్‌’ మాదిరిగా ఏదో కొద్ది రోజులు షూటింగ్‌ చేస్తే కుదరదని తెలిసినా పవన్ ఈ చిత్రాన్ని మొదలు పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. 

‘పింక్’ ను త్వరగా పూర్తి చేసి ఈ వేసవికి విడుదల చేసి ఆ తరువాత తాపీగా క్రిష్ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని పవన్ ప్లాన్ అని అంటున్నారు. అయితే ఇదే సంక్రాంతిని టార్గెట్ చేస్తూ చిరంజీవి కొరటాల మూవీ రావడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీనితో చిరంజీవి కోసం పవన్ త్యాగం చేసి తన డేట్ ను మార్చుకుంటాడ లేదంటే తమ్ముడు కోసం చిరంజీవి తన సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేస్తాడా అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న. అయితే పవన్ కళ్యాణ్ ఊహలు అతడి నిర్ణయాలు ఎవరికీ అర్ధంకావు కాబట్టి పవన్ నటించే ఈ రెండు సినిమాల విషయంలో ఎన్నో మార్పులు వచ్చే ఆస్కారం ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: