సెన్సిబుల్ ప్రేమ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల మరో సెన్సేషన్ తో మన ముందుకి వస్తున్నాడు. ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న కమ్ముల మరోసారి మంచి ప్రేమ కథతో వస్తున్నాడు.  వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమా అటు ఓవర్సీస్ లోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిందింది. ప్రస్తుతం చాలా గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ తో వస్తున్నాడు.

 

 

నాగచైతన్య ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా, సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమా ఐదున్నర కోట్లకి అమ్ముడయిందని సమాచారం. ఇంత మొత్తంలో అమ్ముడయిందంటే అది శేఖర్ కమ్ముల మీదున్న నమ్మకమే అని చెప్పాలి. నాగచైతన్య కెరీర్లోనే ఎక్కువ బడ్జెట్ కి అమ్ముడయిన చిత్రమిది. ఈ సినిమాలో నాగచైతన్య చాలా కొత్తగా కనిపించనున్నాడట.

 

 

తెలంగాణ ప్రాంతానికి చెందిన గ్రామీణ యువకుడి పాత్రలో నాగచైతన్య కనిపిస్తాడట. తెలంగాణ ప్రాంతం వాడిగా తెలంగాణ యాసని కూడా నేర్చుకుంటున్నాడట. ఈ సినిమాలో నాగచైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నామని అంటున్నారు. అదీ గాక శేఖర్ కమ్ముల మొదటి సారిగా హీరో బేస్డ్ గా తెరకెక్కిస్తున్నాడట. అందువల్ల నాగచైతన్య పాత్ర చాలా బలంగా ఉంటుందట. అయితే ఈ సినిమాలో కుల సమస్యని ప్రధానంగా చూపించబోతున్నారట.

 

 

కుల ఆధారిత సమస్యనే శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి ప్రధాన నేపథ్యంగా తీసుకున్నాడని తెలుస్తోంది. ఇద్దరు ప్రేమికులు వేరు వేరు కులాల కారణంగా తమ ప్రేమకథలో సమస్యలను ఎదుర్కునే కథలు ఇప్పటికే చాలా చూశాం, అయితే శేఖర్ కమ్ముల మాత్రం ఈ సినిమాలో ఈ అంశాన్ని కాస్త కొత్తగా చూపించబోతున్నాడట. ఏప్రిల్ 2న ఈ సినిమాని విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: