ఇప్పటివరకు కనీసం దసరాకు వస్తుందని భావించిన ‘ఆర్ ఆర్ ఆర్’ ఈ ఏడాది దసరా కు కూడ రాదనీ ఇప్పడు ఈ సినిమా విడుదలను ఏకంగా వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేసే నిర్ణయాన్ని రాజమౌళి తీసుకున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఇలా రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రెండు కారణాలు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది. 

ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో రాజమౌళి విపరీతమైన పని ఒత్తిడిని ఎదుర్కుంటున్న పరిస్థితులలో ఇంత ఒత్తిడి మధ్య ‘ఆర్ ఆర్ ఆర్’ ను హడావిడిగా పూర్తి చేసి విడుదల చేయడం రాజమౌళికి ఏమాత్రం ఇష్టం లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలకు సంబంధించి 400 కోట్ల కలక్షన్స్ వచ్చాయి అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ‘ఆర్ ఆర్ ఆర్’ ను సంకంతి రేసుకు తీసుకు వస్తే తన ‘బాహుబలి’ రికార్డులను తానే స్వయంగా బ్రేక్ చేసుకోవచ్చు అన్న ఆలోచన కూడ రాజమౌళిలో ఉన్నట్లు టాక్.

దసరా సీజన్ ను చిరంజీవికి ప్రభాస్ కు వదిలి పెట్టి వారిద్దరి సినిమాల మధ్య రెండు వారాలు గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకోమని ఇప్పటికే రాజమౌళి తన మనసులోని అభిప్రాయాన్ని చిరంజీవి ప్రభాస్ లకు తెలియ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో దసరా సీజన్ కు విడుదల అయ్యేలా చిరంజీవి కొరటాల మూవీ అదేవిధంగా ప్రభాస్ జిల్ రాథా కృష్ణల సినిమాల వేగం పెరిగి ఈ దసరాకు ప్రభాస్ చిరంజీవిల మధ్య పోటీ నడవ వచ్చు అని అంటున్నారు. 

దీనికితోడు ‘ఆర్ ఆర్ ఆర్’ ను దేశంలోని పది భాషలలో ఒకేసారి విడుదల చేసే ఆలోచనలలో రాజమౌళి ఉన్న పరిస్థితులలో ఇన్ని భాషలలో ‘ఆర్ ఆర్ ఆర్’ డబ్బింగ్ కార్యక్రమం పూర్తి కావాలి అంటే చాల సమయం అవసరం ఉంటుంది కాబట్టి రాజమౌళి ఈ ఏడాది రేస్ నుండి ‘ఆర్ ఆర్ ఆర్’ తప్పించాడు అన్న మాటలు వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: