ఈమధ్య సినిమాల్లో లిప్ లాక్ అనేది చాలా సాధారణం అయ్యింది. యువ హీరోల సినిమాలే కాదు స్టార్ సినిమాల్లో కూడా స్పేస్ ఉంది అంటే కచ్చితంగా లిప్ లాక్ ఇరికిస్తున్నారు. ఇక యంగ్ హీరోల సినిమాల్లో అయితే అవసరం ఉన్నా లేకున్నా అదరచుంభణం ఉండాల్సిందే. ప్రస్తుతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే హీరోయిన్స్ కూడా లిప్ లాక్ అంటే సై అనేస్తున్నారు. అయితే ఈమధ్య సినిమాల్లో ఈ లిప్ లాక్ ట్రెండ్ బాగా ఎక్కువైందని చెప్పొచ్చు. ఇక ఇదే అదునుగా కొందరు హీరోలు హీరోయిన్స్ మీద వారి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

 

ఇక లేటెస్ట్ గా ఓ కన్నడ సినిమా షూటింగ్ లో డైరక్టర్ కట్ చెప్పినా సరే హీరో హీరోయిన్ పెదాలను ముద్దాడుతూ చాలా దూరం వెళ్లాడట. డైరక్టర్ కట్ కట్ అని మొత్తుకున్నా హీరోయిన్ ను వదల్లేదట ఆ హీరో. తెలుగులో కోమలి సిస్టర్స్ గా పేరు తెచ్చుకున్న తమ మిమిక్రీతో అందరిని ఆకట్టుకున్నారు. అయితే వారు ఇప్పుడు పెద్దై హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కోమలి సిస్టర్స్ లో ఒకరైన హిరోషిణి ఓ కన్నడ సినిమాలో నటిస్తుంది. 1994 మద్రాస్ లో జరిగిన ఓ రియల్ స్టోరీ నేపథ్యతో ఈ సినిమా తెరకెక్కుతుంది.

 

ఉట్రాన్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో రోషన్ హీరోగా నటిస్తున్నాడు. రాజా గజిని డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రోషన్, హిరోషిణిల మధ్య ఓ లిప్ లాక్ ప్లాన్ చేశాడట డైరక్టర్. అయితే జస్ట్ లిప్ లాక్ అని చెప్పి హీరో మాత్రం ఆ హీరోయిన్ నాలుకని సైతం స్మూచ్ చేశాడట. డైరక్టర్ కట్ చెప్పినా ఆమెను వదల్లేదట. అయితే ఫైనల్ గా ఎలాగోలా వదిలించుకున్న హీరోయిన్ షూటింగ్ స్పాట్ నుండి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. ఆ హీరో మీద డైరక్టర్, ప్రొడ్యూసర్ యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.   
 

మరింత సమాచారం తెలుసుకోండి: