ఆర్ ఆర్ ఆర్.. కేవలం టాలీవుడ్డే కాదు..దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. బాహుబలి వంటి పాన్ ఇండియా మూవీ తర్వాత రాజమౌళిపై అంచనాలు దేశవ్యాప్తంగా పెరిగాయి. అలాంటిది.. ఆయన కొత్త మూవీపై ఆ మాత్రం అంచనాలు ఉండటం సహజం. అందులోనూ ఈసారి ఒకరు కాదు ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ చేయడం అందులోనూ ఇద్దరు స్వాతంత్ర్య పోరాట యోధులను తెరపై ఆవిష్కరించడం.. అబ్బో.. సినిమా పై అంచనాలు పెంచే అంశాలు ఒకటా రెండా.

 

 

కాకపోతే.. రాజమౌళితో వచ్చిన చిక్కేమిటంటే.. చిత్రీకరణ నత్త నడకన సాగుతుంది. పెర్ ఫక్షన్ వచ్చే వరకూ రాజీపడని దర్శకుడు కావడంతో పాపం ఫ్యాన్స్ ఏళ్ల తరబడి ఆయన సినిమా కోసం ఎదురు చూడాలి. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా దసరాకు వచ్చే అవకాశం వుందని అప్పట్లో అన్నారు. కానీ ఇది గాలి వార్త అని చాలా మంది కొట్టిపాడేసారు.

 

 

కానీ మళ్లీ ఇటీవల కొంతకాలంగా ఆర్.ఆర్.ఆర్ దసరాకే వస్తుందని కొత్తగా వినిపించడం ప్రారంభించారు. ఇటీవలే హీరోయిన్ ఆలియా భట్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా రెగ్యులర్ గా షూట్ లో పాల్గొంటున్నారు. కాబట్టి దసరాకు ఈ సినిమా వచ్చేస్తుందని అంతా ఆశలు పెట్టేసుకున్నారు కూడా.


ఇప్పుడు లేటెస్ట్ గా, విశ్వసనీయంగా వినిపిస్తున్న సమాచారం మాత్రం ఎన్టీఆర్‌, చెర్రీ ఫ్యాన్స్ గ‌గ్గోలు పెట్టేలా ఉంది. ఆ షాకింగ్ అప్‌డేట్‌ న్యూస్ ఏంటంటే.. ఆర్ ఆర్ ఆర్ ఈ ఏడాది దసరాకు కూడా రాకపోవచ్చట.. వస్తే గిస్తే.. 2021 సంక్రాంతి కే వస్తుందట. ఇందుకు కారణాలు కూడా చెబుతున్నారు. అదేంటంటే.. ఆర్ ఆర్ ఆర్ టీమ్ పై పని వత్తిడి పెరిగిపోయిందట. మరోవైపు రాజమౌళి కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా కాస్త టైమ్ తీసుకుని అయినా బ్లాక్ బ్లస్టర్ అవుట్ పుట్ ఇవ్వాలని భావిస్తున్నారట. అంటే ఇక ఆర్.ఆర్.ఆర్ 2021 సంక్రాంతికే అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: