టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ తన వందవ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ పూర్తి చేసుకున్న తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు.  అయితే గౌతమి పుత్ర శాతకర్ణి హిట్ తర్వాత ఆయనకు ఒక్క హిట్ కూడా పడలేదు. ఆ మద్య తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా చేసుకొని ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించినా.. ఫలితం దారుణంగా వచ్చింది. ఎన్టీఆర్ కథనాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు లాంటి సినిమాలతో భారీ డిజాస్టర్ పొందారు.  అయితే గత ఏడాది రూలర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా ఫ్లాప్ టాక్ రావడంతో ఇక లాభం లేదని తనకు సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన బోయపాటి శ్రీనివాస్ తో ఓ మూవీలో నటిస్తున్నారు బాలకృష్ణ. ఇప్పటికే షూటింగ్ మొదలైపోయింది.. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన టాపిక్ సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతోంది.

 

బాలయ్య సినిమాలో విలన్ పాత్ర చాలా కీలకం. బాలయ్యకు సమానంగా ఆ పాత్రను తీర్చిదిద్దుతారు దర్శకులు. గతంలో లెజెండ్ మూవీలో ఒకప్పటి ఫ్యామిలీ హీరో జగపతిబాబు ని విలన్ గా చూపించి ట్రెండ్ సృష్టించారు.  అయితే బోయపాటి మాత్రం ఈసారి తప్పులో కాలేస్తున్నారేమో అనిపిస్తోంది.  ఈ సినిమాలో విలన్‌గా ప్రముఖ కమెడియన్ సునీల్‌ను ఎంపికచేసుకున్నారట. ఇటీవల విడులదైన ‘డిస్కో రాజా’ సినిమాలో సునీల్ ఓరకంగా విలన్ పాత్రనే పోషించారని చెప్పాలి. ఆ మద్య కామెడీ హీరోగా వరుసగా సినిమాలు నటించి పెయిల్యూర్స్ తో సతమతమైన సునీల్.. మళ్లీ కామెడీ రోల్స్ తో ముందుకు సాగుతున్నారు.  

 

ఈ మద్య విడులదైన ‘డిస్కో రాజా’ సినిమాలో సునీల్ ఓరకంగా విలన్ పాత్రనే పోషించారని చెప్పాలి. ఆయనలోని మరో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు దర్శకుడు వీఐ ఆనంద్. మరి బోయపాటి.. ఈ కమెడియన్ ని విలన్ గా ఏ యాంగిల్ లో చూపిస్తారో చూడాలి. బాలయ్య 106వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఫ్రిల్‌లో షూటింగ్ కంప్లీట్ చేసి మేలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: