బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఇంట విషాదం చోటు చేసుకుంది.  ఆయన సోదరి సోదరి నూర్ జెహాన్ (52) మరణించారు. చిన్న నాటి నుంచి తన సోదరితో ఎంతో అనుబంధం ఉందని.. ఆమె మరణ వార్త షాక్ కి గురి చేసిందని షారూఖ్ ఆవేదన చెందుతున్నారు. దూరదర్శన్ లో ఫౌజీ(1988) సీరియల్ లో ఒక సైనికుడి పాత్ర ద్వారా బుల్లితెరలో నటించారు షారుఖ్.  ఈ పాత్ర ద్వారా మంచి పేరు సంఫాదించుకున్న ఆయనకు ఆ తరువాత  ‘సర్కాస్’ సీరియల్ సినిమాల్లో అవకాశం వచ్చేలా చేసింది.  1992లో దీవానా అనే సినిమాలో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ చేశారు షారూఖ్. 1993లో విడుదలైన బాజీగర్, దార్ సినిమాల్లో విలన్ గా నటించి మంచి పేరు సంపాదించాడు.  ఆ తర్వాత హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన షారూఖ్ నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లారు.  

 

కేవలం వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా వ్యాఖ్యాతగా తన సత్తా చాటుతున్నారు.  షారుఖ్ సోదరి నూర్ జెహాన్ చనిపోయిన వార్త విన్న షారూఖ్ కుటుంబ సభ్యుల కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. జెహాన్‌ తండ్రి షారుక్‌కు పినతండ్రి అవుతారు. నూర్‌ జెహాన్‌ పెషావర్‌లోని కిస్సా ఖ్వానీ బజార్‌ సమీపంలోని మొహల్లా షా వాలి కతాల్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. కొంతకాలంగా జెహాన్‌ నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని ఆమె భర్త ఆసిఫ్‌ బుర్హాన్‌ పేర్కొన్నారు. నూర్‌ మరణించిన విషయాన్ని ఆమె సోదరుడు మన్సూర్‌ అహ్మద్‌ సైతం ధృవీకరించారు. నూర్ జెహాన్ కి  షారుక్‌ కుటుంబంతో  సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 

చిన్నతనంలో వీరంతా కలిసి మెలిసి ఉండేవారని తెలుస్తుంది. కింగ్‌ఖాన్‌ తన తల్లిదండ్రులతో కలిసి పెషావర్‌లోని నూర్‌ కుటుంబాన్ని రెండుసార్లు సందర్శించారు. నూర్‌ మరణంతో  షారుఖ్‌, నూర్‌ జెహాన్‌తో కలిసి దిగిన ఫోటోలను అభిమానులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. కాగా,  పాకిస్తాన్‌లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జెహాన్‌ జిల్లా, పట్టణ కౌన్సిలర్‌గా పనిచేశారు.  ఆ మద్య జూలై 2018 సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక అసెంబ్లీకి నామినేషన్‌ దాఖలు చేసి తరువాత ఉపసంహరించుకున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: