బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ మామూలుగా సాగడం లేదు. సగానికి సగం సినిమాలు బయోపిక్సే తెరకెక్కుతున్నాయి. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోలు బయోపిక్స్ తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న సంగతి తెలిసిందే. అలాంటి సంచలనం సృష్ఠించిన క్రీడాకారిణి బయోపిక్ తెరకెక్కుతోంది. మహిళ టీం ఇండియా జట్టు అనగానే ఠక్కున వినిపించే పేరు.. గుర్తుకు వచ్చే క్రీడాకారిణి మిథాలీ రాజ్. దాదాపు రెండు దశాబ్దాలుగా క్రికెట్ ఊరిపిగా జీవిస్తూ మహిళ టీం ఇండియా జట్టుకు అద్బుత విజయాలను అందించిన గొప్ప క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ ఇండియన్ క్రికెట్ చరిత్రలో నిలిచి పోతుంది. అందుకే ఈమె జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో సినిమాని తెరకెక్కిస్తున్నారు. 'శబాష్ మిథు'... టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు.

 

ఇక ఈ సినిమాలో మిథాలీ రాజ్ పాత్రను బాలీవుడ్ టాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన తాప్సి పన్ను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ పాత్ర కోసం తాప్సి క్రికెట్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడంతో పాటు చాలా హోమ్ వర్క్ చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే అది నిజమేనన్న్న విషయ్మ్ తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ను చూస్తుంటే తాప్సి పడ్డ కష్టం కనిపిస్తుంది. మిథాలీ లాగా స్క్రీన్ మీద కనపడేందుకు బాడీ పరంగా.. బాడీలాంగ్వేజ్ పరంగా.. ఇతర విషయాల పరంగా చాలా కష్టపడ్డట్లు ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది.

 

ఇక ఈ సినిమానును వయోకమ్ 18 సంస్థ నిర్మిస్తుండగా రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మరో ఫ్రెష్ అప్‌డేట్ ఏమిటంటే ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారట. తాప్సిసినిమా కోసం కొన్ని సినిమాలను కూడా వదులుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఇక  హిందీతో పాటు తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా 'శబాష్ మిథు' సినిమాను విడుదల చేసే ఆలోచనలో వయోకమ్ 18 సంస్థ ఉన్నారట. మొత్తానికి తాప్సీ తెలుగులో నిలదొక్కుకోలేకపోయినప్పటికి బాలీవుడ్ లో మాత్రం బాగా సక్సస్ అయిందని చెచెప్పాలి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పింక్, బద్లా సినిమాలు చేసి మంచి నటిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాదు బాలీవుడ్ నుంచి కొన్ని కథలు కేవలం తాప్సీ నే చేయాలన్న పేరుని సంపాదించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: