టాలీవుడ్ లో ఉన్న అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళికి కథలు రాయడం రాదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చాలా సార్లు బాహాటంగా చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే రాజమౌళి తనకు వచ్చిన ఐడియాలను తండ్రి విజయేంద్రప్రసాద్ కు చెప్పి కథ రాయించుకుంటారు. ఈ కారణం తోనే రాజమౌళి సినిమాల్లో కేవలం ‘స్క్రీన్ ప్లే-దర్శకత్వం’ కి మాత్రమే రాజమౌళి పేరు కనిపిస్తుంది తప్ప కథ విషయంలో కనిపించదు. ఇక ఆయన కథలు తయారు చేసుకోవడానికే సంవత్సరాలు తీసుకుంటారు. పక్కాగా కథ రెడి అయితే గాని సినిమా ప్రకటించరు. బాహుబలి తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ కథ కోసం కూడా ఇలా సంవత్సరన్నర పైగానే టైం తీసుకున్నారు.

 

ఇక ‘అల వైకుంఠపురం’ సినిమా కథ కోసం కూడా త్రివిక్రమ్ సంవత్సరం పైనే తీసుకున్నారు. ఇదే కాదు సాధారణంగా త్రివిక్రమ్ ఏ కతహ సిద్దం చేసుకోవాలన్న సంవత్సరం పడుతుంది. ఈ ఇద్దరే కాదు మెగాస్టార్ కోసం సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కూడా కథ కోసం సంవత్సరం కష్ట పడ్డాడట. మరి ఇలా కథ కోసం తెలుగు దర్శకులు సంవత్సరాలకు సంవత్సరాలు సమయం తీసుకుంటుంటే.. ఆ సినిమాలను తెరమీదకి తీసుకొచ్చేసరికి ఇంకెంత సమయం పట్టాలి. అందుకే టాలీవుడ్ లో మన స్టార్ డైరెక్టర్స్ కనీసం రెండేళ్ళకి ఒక సినిమాని కూడా తీయలేకపోతున్నారు. అందరిలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాత్రం హీరో ఎవరైనా 4 నెలల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడు.

 

టాలీవుడ్ ను కథల కొరత ఉంది. దీన్ని ఒప్పుకోవాల్సిందే. ఒక మంచి కథ తయారు కావడానికి సంవత్సరంకు పైగా పడుతోంది. అది తెరకెక్కించాలంటే కనీసం సంవత్సరంన్నర నుంచి రెండేళ్లు పడుతుంది. ఇలా కథల కోసం ప్రస్తుతం హీరోలు కూడా బాగా ఎదురు చూస్తున్నారు. కొత్తగా ఆలోచించడం కొత్త తరహా కతలను రాసుకోవడానికి మన దర్శక రచయితలు బాగానే కష్టపడుతున్నాఉ. ప్రస్తుతం బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ లో బయో పిక్స్ ట్రెండ్ నడుస్తోంది. అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ ఆ కథను ఓ వాస్తవ మెడికల్ స్టూడెంట్ జీవితాన్నే స్ఫూర్తిగా తీసుకొని రాశారు. 

 

నిజానికి వాస్తవిక కథలు హిట్ బాగా అవుతుంటాయి. కానీ అదే సమయంలో ఆ వాస్తవికతను బోల్డ్ నెస్ అని సంప్రదాయవాదులు సినిమాపై తీవ్రంగా విమర్శలు చేస్తారు. బాహుబలి కూడా ఒక భారతీయ ఇతిహాసాల్లోని కథలను బేస్ చేసుకొని కమర్షియల్ పంథాలో తయారు చేసిన కథ. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ కూడా కొమురంభీం అల్లూరి జీవితాల్లో వారు అజ్ఞాతవాసం ఇద్దరూ ఒకేసారి ఎటువెళ్లిపోయారో దాన్ని బేస్ చేసుకొని తయారు చేసినదే కావడం ఆసక్తికరం. రాజమౌళి లాంటి అగ్ర దర్శకులున్నప్పటికి ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ కథల సమస్య ఎక్కువగా ఉంది. దీనికి సరైన పరిష్కారం రచయితలు దర్శకుల చేతుల్లోనే ఉంది. వాస్తవ సంఘటనలు, స్పూరి దాయకమైన కథలను తీసుకుంటే త్వరగా సినిమాలు రూపొందించే అవకాశాలు మెండుగా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: