సాధారణంగా సినిమాల్లో ఛాన్స్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తాడు.. ముఖ్యంగా హీరో ఛాన్స్ వస్తే ఇక అంతకన్న లోకంలో అదృష్టం ఏదీ ఉండదని అనుకుంటారు.  జబర్ధస్త్ లో తనదైన కామెడీ మార్క్ చాటుకుంటూ అందరి మనసు గెల్చుకుంటున్న హైపర్ ఆది మాత్రం ఈవిషయంలో భిన్నంగా ఉన్నట్లో టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు పేరును సంపాదించుకున్నారు. ఈ షో కొంతమంది ఆర్టిస్టుల జీవితాలనే మార్చేసింది. చాలా మంది సినిమాల్లో ఛాన్సులు దక్కించుకొని మంచి పొజీషన్లోకి వచ్చారు. అయితే కేవలం కమెడియన్లు గానే కాకుండా హీరోలు గా కూడా నటించారు.  ధన్ రాజ్, శకలక శంకర్ రీసెంట్ గా సుడిగాలి సుధీర్.  ఇలా కమెడియన్లుగా నటిస్తూనే హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాకపోతే వీరు అనుకున్న టార్గెట్ మాత్రం చేరుకోలేకపోయారు.

 

ఎందుకంటే గతంలో బెస్ట్ కమెడియన్లుగా వచ్చిన ఆలీ, బ్రహ్మానందం, సుధాకర్ లాంటి వాళ్లే హీరోలుగా నటించి చివరికి కమెడియన్లుగా మిగిలిపోయారు.  ఇటీవల సుధీర్ నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్ ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది.  అయితే సుధీర్ కి ఉన్న టాలెంట్ తో మంచి ఫామ్ లోకి వస్తారని భావించారు.  కానీ ఈ మూవీ అసలు వచ్చినట్టు.. పోయినట్టు కూడా ఎవ్వరికీ తెలియదు. కనీస వసూళ్లు కూడా తీసుకురాలేదు.   ఇప్పుడు సుధీర్ ను చూసి హైపర్ ఆది భయపడుతున్నాడట. అతని చూస్తేనే వణికిపోతున్నాడట ఆది.

 

ఇందుకు జబర్దస్త్ వేదికలపై సుధీర్ ఆదిని టార్గెట్ చేస్తాడని కాదండోయ్.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో ఆది మాట్లాడుతూ.. తనకు హీరోగా నటించాలని కొన్ని ఆఫర్లు వచ్చినా.. సినిమాల్లో కెరీర్ సాఫీగా సాగుతుందా లేదా అన్నది డౌట్ అని అన్నారు.  సుధీర్ అంటే తనకు ఇష్టమని… ఇద్దరం కలిసి ఎన్నో స్కిట్స్ కూడా చేశామని చెప్పుకొచ్చాడు. ఆది కేవలం ఎంటర్ టైన్ మెంట్ థీమ్ తో వస్తేనంటే జనం ఆదరిస్తారని.. ఒకవేళ వెండి తెరపై నటించే అవకాశం వస్తే భవిష్యత్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.  మొత్తానికి జబర్ధస్త్ లో నటుల ప్రభావం ఆదిపై పడిందా అని టాలీవుడ్ లో గుస గుస..

 

మరింత సమాచారం తెలుసుకోండి: