కొందరికి సినిమా అవకాశాలు కావాలన్నప్పుడు రావు. అంతే కాదు. ఆ అవకాశాలను సంపాదించుకోవడానికి, నానా తంటాలు పడతారు. ఇందుకు గాను, ఒంటి మీద గుడ్దలు ఉన్నాయా లేవా అన్నట్లుగా, ఫోటోషూట్స్ చేస్తూ, సినిమా ఇండస్ట్రీ పెద్దల దృష్టిలో పడాలని చివరి వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఇలా వారి ఫ్రీ షో ను చూస్తారే గాని అవకాశం మాత్రం ఇవ్వరు.. ఇక మరికొందరు, అదృష్టాన్ని ముఖాన రాసుకుని వస్తారేమో గాని, వారి సినిమాలు యావరేజ్‌గా ఆడినా, ఛాన్స్‌లు మాత్రం వరసపెట్టి వస్తుంటాయి.. ఇలాంటి కోవకే చెందిన ఎవర్ గ్రీన్ హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే అని చెప్పవచ్చు..

 

 

ఇక తాజాగా విడుదలైన అల వైకుంఠపురములో చిత్రం పూజాకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ఇకపోతే ఫర్‌ఫెక్ట్ ఫిజిక్‌ను మెయింటెన్ చేస్తూ, వరుసగా సినిమా అవకాశాలను తెచ్చిపెట్టుకుంటుంది.. ఇక ఇప్పటికే ఈ బ్యూటీ, అల్లు అర్జున్ తో కలిసి డీజే మూవీలో బికినీ లుక్ లో నటించి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. ఇదే కాకుండా అప్పుడప్పుడు అందచందాలతో అందరినీ తనవైపు తిప్పేసుకుంటూ, అద్భుతమైన తన యాక్టింగ్ స్కిల్స్ తో బిగ్ స్కీన్స్ పై అందరినీ ఎట్రాక్ట్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు తన హాట్ ఫొటోలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ వుంటుంది..

 

 

ఇకపోతే 2014 లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ కెరియర్ ఇప్పుడు హై స్పీడ్ ఇంటర్‌నెట్‌లా వేగంగా దూసుకుపోతుంది... ఇక మరో విషయం ఏంటంటే ఈ అందాల తార పూజా హెగ్డే ఎప్పుడు ఫిట్ గా ఉండేందుకు రోజు జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంటారు. అయితే అప్పుడప్పుడు ఆ జిమ్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన అభిమానులతో పంచుకుంటారు. ఈ సొగసరి  ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ఎలా వర్కౌట్స్ చేస్తున్నారో చూడండని ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వీడియో చూసిన కొంటే కుర్రాళ్ళూ తమ ఊహాలకు పదును పెడుతూ, కవితలు అల్లేస్తున్నారట. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: