టాలీవుడ్ లో ‘ఊహలు గుస గుసలాడే’ మూవీతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు నాగశౌర్య.  ఈ మూవీ షూటింగ్ లో ఉండగానే చందమామ కథలు మూవీలో ఛాన్స్ వచ్చింది.  ఈ రెండు మూవీస్ మంచి కమర్షియల్ హిట్స్ అందుకున్నాయి. ఆ తర్వాత దిక్కులు చూడకు రామయ్య మూవీ రిలీజ్ అయ్యింది.. ఈ మూవీ పెద్దగా ఫలితం రాబట్టలేక పోయింది. ఇదే సంవత్సరంలో నాగశౌర్చ "లక్ష్మీ రావే మా ఇంటికి",   "జాదూగాడు", "అబ్బాయితో అమ్మాయి" మూవీలో నటించాడు.  అయితే ఈ మూవీస్ అన్నీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.. కాకపోతే హీరోగా నాగశౌర్య కు మంచి పేరు వచ్చింది. అయితే హీరోగానే కాకుండా నిర్మాత అవతారం కూడా ఎత్తాడు.   ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగశౌర్య తర్వాత నర్తన శాల సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు.  

 

మూవీ భారీ నష్టాలనే తెచ్చిపెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.  తాజాగా నాగశౌర్య హీరోగా 'అశ్వద్ధామ' నిర్మితమైంది. ఈ సినిమా ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమవు తున్నాడు. యాక్షన్, ఎమోషన్ సమపాళ్లుగా కలిపి నాగశౌర్యనే ఈ కథను తయారు చేయడం విశేషం. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే.  ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్ సందర్భంగా నాగశౌర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మాట నిలబెట్టుకోకపోతే చని పోయినట్టే అంటూ తన గత సినిమా విషయం గురించి మాట్లాడారు.

 

ఛలో సినిమాతో మంచి లాభాల్ని అందుకున్న తాను.. నర్తనశాల డిజాస్టర్ సినిమా అని ముందే ఊహించినట్లు నాగశౌర్య చెప్పాడు. ఆ విషయం తెలిసే రిస్క్ తీసుకున్నానని అన్నారు. తన సొంత ప్రొడక్షన్ లోనే నాగ శౌర్య నర్తనశాల అనే సినిమా చేశాడు.  ఇకపోతే అశ్వద్ధామ విషయంలో మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు చెబుతూ.. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని చెబుతున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: