కార్తీక దీపం సీరియల్ మంచి ట్విస్టులతో ముందు దూసుకెళ్తోంది. ఎప్పటికప్పుడు ఇక చివరికి వచ్చేసినట్టు అనిపించే కథనంతో 716 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 717 ఎపిసోడ్ లోకి చేరుకుంది. ఇప్పటికే దీప దగ్గర పెరుగుతున్న సౌర్యకు తన తండ్రి డాక్టర్ కార్తీక్ అన్న విషయం తెలిసిపోయింది. మరోవైపు కార్తీక్ దగ్గర పెరుగుతున్న హిమకు సైతం వంటలక్క దీపతో డాక్టర్ బాబును ఇచ్చి పెళ్లి చేయాలని గట్టి ప్రయత్నం చేస్తోంది. అయితే ఇలాంటి స‌మ‌యంలోనూ ఎన్నో ట్విస్టుల‌తో సీరియ‌ల్ కొన‌సాగుతోంది.

 

తాజాగా పిల్లలు  హిమ, సౌర్యలు ఇద్దరూ ఇప్పుడు కార్తీక్, దీపలు ఇద్దరూ తమ అమ్మానాన్నలే అనే విషయానికి దగ్గరగా వచ్చేస్తున్నారు. కార్తీక్ తమ్ముడి భార్య శ్రావ్య డెలివరీ విషయంలో మౌనిత చిన్న నాటకం ఆడుతుంది. ఆమె కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందనీ.. డాక్టర్ మౌనిత వస్తే తప్ప ఏమీ చెయలెమనీ శ్రావ్యను చూస్తున్న డాక్టర్ రిజ్వనా తో అబద్ధం చెప్పిస్తుంది. దీంతో కార్తీక్ మౌనితకు ఫోన్ చేసి శ్రావ్యకు వైద్యం చేయమని మౌనితను కోరతాడు. మౌనిత తన పథకం స‌క్సెస్ అయింద‌ని సంతోషించి.. అక్కడ మీ వాళ్ళు ఒప్పుకుంటేనే వస్తాను అంటుంది. దాంతో నేను చెప్పింది చేయి అంటూ విసుక్కుంటాడు కార్తీక్. 

 

అప్పుడు ఆసుపత్రికి వచ్చిన మౌనిత శ్రావ్యకు ఇంజక్షన్ ఇవ్వబోతుంది. అయితే, గతంలో తనకు ఇంజక్షన్ ఇచ్చి గర్భం పోగొట్టాలని మౌనిత ప్రయత్నించిన విషయం దీపకు గుర్తువచ్చి.. శ్రావ్యకు మౌనిత ఇంజక్షన్ ఇవ్వద్దని వారిస్తుంది. దీంతో కార్తీక్ దీప పై కోప్పడతాడు. మొత్తమ్మీద కొంత హంగామా తరువాత శ్రావ్యకు మగపిల్లవాడు పుట్టాడనీ,,తల్లీ పిల్లాడు క్షేమం అనీ మౌనిత చెప్పి వెళ్ళిపోతుంది. అయితే, ఇక్కడ పిల్లలిద్దరికీ దీప కార్తీక్ ల మధ్య ఎదో ఉందనే అనుమానం వస్తుంది. ఈ క్ర‌మంలోనే హిమ‌కు వంట‌ల‌క్క పేరు దీప అని కూడా తెలుసిపోతుంది. మొత్తానికి ఇటు హిమ, అటు సౌర్యలు నిజానికి చాలా ద‌గ్గ‌ర‌గా రావ‌డంతో క‌థ ఆసక్తిగా మారింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: