ఇప్పుడు ప్రపంచంలో కరోనా ఎఫెక్ట్ మామూలుగా లేదు. ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి.. ఇక మొన్న స్వైన్‌ఫ్లూ.. నిన్న ఎబోలా.. ఇప్పుడేమో కరోనా వైరస్‌. ఇవన్ని ఎలా పుడుతున్నాయో తెలియదు గాని, ప్రపంచ మేధావి అని చెప్పుకునే మనిషి తెలివి తేటలను వెక్కిరిస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ వైరస్ వల్ల చిత్రపరిశ్రమ బోసిపోయిందట.. ఇక వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఎవరు కూడా బయటకు రావడం లేదు. నలుగురిలో కలవాలంటే భయపడుతున్నారు..

 

 

ఇప్పటికే చైనాలో 130 మందికి పైగా మరణించారట. ఇదే కాకుండా వేలాదిమంది ఆస్పత్రుల్లో అల్లాడుతున్నారు.. దీంతో చైనా దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లు క్లోజ్ చేయడమే కాకుండా, కొత్త సినిమాల విడుదలను కూడా ఆపేసి, షూటింగ్ లకు విరామం కూడా ప్రకటించారట. ఇక వివిధ దేశాల నుంచి చైనాకు వచ్చేవారు, చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్ళేవారు తగ్గిపోయారు. అంతే కాకుండా, చైనా దేశంలో ఉన్న 70 వేల థియేటర్స్ యాజమాన్యాలు, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు స్వచ్చందంగా తమ థియేటర్స్ క్లోజ్ చేసేశాయి.

 

 

ఇక ఏటా జనవరి 25 నుంచి చైనాలో న్యూ ఇయర్ లూనార్ హాలిడేస్ జరుపుకుంటుండగా, ఇప్పుడు ఆ సందడి ఎక్కడా కనిపించడం లేదు.. ఇకపోతే ఈ హాలిడేస్‌ సందర్భంగా చైనా థియేటర్స్ అన్నీ కళకళలాడుతూ భారీగా బాక్సాఫీస్ వసూళ్లు రాబడతాయి. కానీ కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఆ సినిమాల విడుదలను వాయిదా వేసేశారు. దీంతో భారీగా నష్టం వాటిల్లుతోందని బయ్యర్లు గగ్గోలు పెడుతున్నారు.

 

 

ఇదే కాకుండా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలపై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. అంతేకాదు, ప్రస్తుతం చైనాలో విడుదల అవకుండా ఈ చిత్రాలను మరే ఇతర దేశంలోనూ విడుదల చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో చైనాటౌన్ 3, లీప్ సినిమాలు వాయిదా పడ్డాయి. భారతీయ సినిమాలు కూడా వాయిదాపడ్డాయి... చూశారా అక్కడి ప్రభుత్వం ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఇక మనదేశంలో చిన్న చిన్న సమస్యలకే, ప్రభుత్వాలు ఆల్లాడిపోతాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: