మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఏడాది వచ్చే సంక్రాంతి పండుగకు కొన్ని పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయి ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను అలరించడం ఎప్పటి నుండో వస్తోంది. ఇక అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణల మధ్య సంక్రాంతి పోటీ ఉండగా, ఆ తరువాత ఎక్కువగా చిరంజీవి, బాలకృష్ణల మధ్యన ఆ పోటీ ఉండేది. ఇక ఇటీవల సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోలుగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురములో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండూ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. 

 

ఇకపోతే దాదాపుగా ఇరవై ఏళ్ల క్రితం 2001 సంక్రాంతి సమయంలో వచ్చిన మెగాస్టార్ మృగరాజు, యువరత్న బాలకృష్ణ నరసింహనాయుడు, విక్టరీ వెంకటేష్ ల దేవిపుత్రుడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఆ సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ మూడు సినిమాలపై అప్పటి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే ముందుగా జనవరి 11న రిలీజ్ అయిన మెగాస్టార్ మృగరాజు, బాలయ్య నరసింహనాయుడులలో మృగరాజు ఘోరంగా ఫ్లాప్ అవ్వగా, నరసింహనాయుడు సూపర్ డూపర్ హిట్ కొట్టి అత్యద్భుత విజయాన్ని అందుకుంది. ఇక  ఆతరువాత సరిగ్గా 15 రోజుల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్ దేవిపుత్రుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయం పాలయింది. అయితే ఆ సినిమాల రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ మధ్య భారీ స్థాయిలో పోటీ, ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. 

 

ఇక అంతకముందు మెగాస్టార్ అన్నయ్య వంటి మాస్, కమర్షియల్ సినిమాతో హిట్ కొట్టి ఉండగా, బాలయ్య వరుసగా నాలు ఫ్లాప్స్ లో ఉన్నారు, అలానే వెంకటేష్ కూడా కలిసుందాం రా, జయం మనదేరా సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టి ఉన్నారు. కాగా వరుసగా హిట్స్ లో ఉన్న చిరు, వెంకీ ఫ్లాప్స్ ని మూటగట్టుకోగా, ఫ్లాప్స్ లో బాలయ్య మాత్రం నరసింహనాయుడు తో అత్యద్భుత విజయాన్ని అందుకుని సరికొత్త రికార్డ్స్ నెలకొల్పారు. అప్పట్లో ఆ సినిమా నెలకొల్పిన రికార్డ్స్ ఇప్పటికీ కొన్ని చోట్ల పదిలంగానే ఉండడం విశేషం. ఇక ఇటీవల వచ్చిన సంక్రాంతి సీజన్ సినిమాల పోటీ, ఆ ఏడాది సంక్రాంతి సినిమాల మధ్య జరిగిన ఆసక్తికర పోటీ తో పోలిస్తే అతి చిన్నదని, మరి రాబోయే రోజుల్లో సంక్రాంతి సమయంలో ఏ ఏ సినిమాలు తలపడతాయో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: