పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో తన రెండవ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే రోజే దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను లాంచ్ కూడా చేశారు. ఇప్పుడు పింక్ రీమేక్ తో కలిపి రెండు చిత్రాలను పవన్ సెట్స్ వైపు మళ్ళించాడు. పింక్ రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే మొదలవగా క్రిష్ సినిమా యొక్క షూటింగ్ కూడా వచ్చే నెలలో మొదలవుతుంది. అయితే ఇప్పుడు రెండు చిత్రాలు సెట్స్ పైకి వచ్చేటప్పటికి క్యాస్టింగ్ డైరెక్టర్స్ మరియు ప్రొడక్షన్ మేనేజర్స్ చాలామంది పెద్ద హీరోయిన్ల యొక్క కాల్షీట్స్ లో ఖాళీ ఉందేమో అని చూసే పనిలో ఉన్నారు.

 

ఎందుకంటే రెండు చిత్రాల్లో పవన్ కు ముగ్గురు హీరోయిన్లు అవసరం. 'పింక్' చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జతగా హీరోయిన్ కు ఎటువంటి స్కోప్ లేనప్పటికీ పవన్ ఒక ప్రముఖ హీరోయిన్ తో చిత్రంలో డాన్స్ చేయాల్సి ఉందట. ఇకపోతే పాట కోసం దర్శకుడు పూజా హెగ్డే ని సూచించినప్పటికీ దిల్ రాజు వేరే హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నాడట. ఇక క్రిష్ సినిమా కి వచ్చినట్లయితే పిరియాడిక్ మూవీకి ఇద్దరు హీరోయిన్లు అవసరం.

 

అందుకోసమే చిత్ర యూనిట్ ఒక పెద్ద స్టార్ హీరోయిన్ మరియు ఒక కుర్ర హీరోయిన్ వెతికే పనిలో ఉన్నారు. అయితే క్రిష్ కు మాత్రం వచ్చే ఇద్దరు హీరోయిన్లు అతనికి డేట్స్ ను చాలా ఎక్కువగా ఇచ్చే లాగా ఉండాలని మరియు ఎప్పుడు పిలిస్తే అప్పుడు సెట్స్ కు వచ్చే అంత వీలు గా ఉండాలని పట్టుబట్టాడు అట. ఎందుకంటే పవన్ అటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు కాబట్టి ఒక్కసారిగా రాష్ట్రంలో పరిస్థితులు వేడెక్కితే సమయంలో అయినా షూటింగ్ షెడ్యూల్స్ మారిపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: