మెగా హీరోలు ఒక క్రికెట్ టీమ్ సంఖ్యకు దరిదాపులో ఉన్న నేపధ్యంలో ఒక సంవత్సరంలో కనీసం ఐదు ఆరు సినిమాలు మెగా హీరోలవే విడుదల అవుతున్న పరిస్థితి. తొమ్మిది సంవత్సరాలు గ్యాప్ తీసుకుని చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ గా వస్తే ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించడమే కాకుండా ఆ సినిమాకు 100 కోట్లకు పైగా నెట్ కలక్షన్స్ ను కురిపించారు. ఆ తరువాత రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీకి ప్రేక్షకులు 120 కోట్లకు పైగా నెట్ కలక్షన్స్ ను ఇవ్వడంతో చిరంజీవి రికార్డును చరణ్ బ్రేక్ చేసాడు. 

అయితే ఆ తరువాత ‘సైరా’ తో ‘బాహుబలి’ రికార్డును చిరంజీవి బ్రేక్ చేయాలని ప్రయత్నించినా ఆప్రయత్నం ఫెయిల్ అయినా ‘సైరా’ తో చిరంజీవికి గౌరవం దక్కింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఏకంగా తన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో చిరంజీవి చరణ్ ల రికార్డులను బ్రేక్ చేసి ఇక బ్రేక్ చేయడానికి ఒక్క ‘బాహుబలి’ రికార్డులను మాత్రమే మిగిల్చాడు. వాస్తవానికి అల్లు అర్జున్ మెగా హీరోల నుండి కొద్దిగా దూరం జరుగుతున్నా రికార్డుల విషయం వచ్చే సరికి బన్నీ రికార్డులను ఇప్పటికీ మెగా ఫ్యామిలీ రికార్డులుగానే చూస్తున్నారు. 

ఈ పరిస్థితి ఇప్పుడు నందమూరి అభిమానులకు విపరీతమైన అసహనాన్ని కలిగిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. పేరుకు నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణ జూనియర్ కళ్యాణ్ రామ్ తారకరత్న లాంటి హీరోలు ఉన్నా ప్రస్తుతం ఒక్క జూనియర్ కు తప్ప ఎవరికీ చెప్పుకోతగ్గ క్రేజ్ లేదు. గత సంవత్సరం బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తో మాత్రమే కాకుండా ‘రూలర్’ మూవీతో కూడ ఘోర పరాభవాన్ని తెచ్చుకోవడంతో అసలు బాలయ్య ఎప్పుడు కోలుకుంటాడు అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇక కళ్యాణ్ రామ్ పరిస్థితి వేరు పేరుకు వరసపెట్టి అతడు సినిమాలు చేస్తున్నా కళ్యాణ్ రామ్ మూవీలకు కనీసపు కలక్షన్స్ కూడ రావడం లేదు ఇక తారక రత్న పరిస్థితి మరింత ఘోరం. 

ఇలాంటి పరిస్థితులలో జూనియర్ నటిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ రికార్డులు క్రియేట్ చేసినా ఆ రికార్డుల ఖ్యాతి ముందుగా రాజమౌళికి వచ్చిన తరువాత జూనియర్ చరణ్ తో షేర్ చేసుకోవలసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో బాలయ్య వారసుడుగా మోక్షజ్ఞ వచ్చి నందమూరి ఫ్యామిలీ వారసత్వం కొనసాగిస్తాడు అనుకుంటే అతడికి సినిమాల పై పెరిగిపోతున్న విరక్తి నందమూరి అభిమానులకు షాక్ ఇస్తోంది. దీనితో ఒకప్పుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని రాజకీయాలను ఏలిన నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఆదిపత్యం ముందు నిలబడలేక పోతోందా అంటూ బయటకు చెప్పుకోలేని బాధలో నందమూరి అభిమానులు రోజులు లెక్కపెడుతున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: