సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న హీరోయిన్ సమంత కేవలం స్టార్ హీరోయిన్ గానే కాదు అక్కినేని ఇంటి కోడలిగా కూడా తెలుగు వాళ్లకు మరింత దగ్గరయ్యింది. కమర్షియల్ హీరోయిన్ నుండి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన సమంత ఒక సినిమా విషయంలో తను తీసుకున్న ఓ డేర్ స్టెప్ తన కెరియర్ ను రిస్క్ లో పడేసింది. పెళ్లి తర్వాత హీరోయిన్స్ కు అసలు డిమాండ్ ఉండదు కాని ఆ సెంటిమెంట్ కూడా బ్రేక్ చేసింది సమంత. పెళ్లి తర్వాత కూడా తన ఫాం కొనసాగిస్తూ సూపర్ సెన్సేషన్ గా మారింది ఈ అమ్మడు. 

 

ఇక ఇలాంటి టైంలో కెరియర్ లో ఆచితూచి అడుగులేస్తుంది సమంత. అయితే తెలుగులో మంచి సినిమాలు చేస్తున్న సాం తమిళంలో లాస్ట్ ఇయర్ చేసిన సూపర్ డీలక్స్ సినిమా ఎన్నో గొడవలు అయ్యేలా చేసింది. విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాలో రమ్యకృష్ణ వేశ్యగా చేసింది. ఇక ఆ సినిమాలో సమంత ఆల్రెడీ పెళ్లయ్యాక మరో వ్యక్తితో రిలేషన్ ఏర్పరచుకుంటుంది. ఆ సినిమాలో ఛాన్స్ వచ్చి.. తన పాత్ర విన్న తర్వాత సమంత నిజంగ షాక్ అయ్యిందట. ఆ క్షణం సమంత ఆలోచనలో తను ఇలాంటి సినిమా చేస్తే తన ఫ్యాన్స్ ఏమని అనుకుంటారో అన్నట్టుగా ఆలోచించిందట.

 

ఫైనల్ గా తన సన్నిహితుల ప్రోత్సాహంతో ఆ సినిమా చేసింది. సమంతకు మంచి పేరు తెచ్చింది. అయితే ఆ సినిమా విషయంలో తన డెశిషన్ కరెక్టా కాదా అన్నది ఇప్పటికి డైలమానే అంటుంది సమంత. ప్రస్తుతం 96 తెలుగు రీమేక్ జాను సినిమాలో నటించిన సమంత ఆ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం పక్కా అని తెలుస్తుంది. శర్వానంద్ హీరోగా మాత్రుక దర్శకుడు ప్రేం కుమార్ జాను తెరకెక్కించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: