‘సరిలేరు నీకెవ్వరు’ ఊహించిన స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయకపోయినా దర్శకుడు అనీల్ రావిపూడి హిట్ ట్రాక్ రికార్డును ఏమాత్రం చెడగొట్టలేక పోయింది. దీనితో 5 సినిమాల వరస విజయాలను అందుకుని రాజమౌళి కొరటాల శివ ల స్థానంలోకి అనీల్ రావిపూడి వెళ్ళి పోయాడు. 

ఇటువంటి సమయంలో తన హిట్ ట్రాక్ రికార్డును మరింత మెరుగు పరుచుకోవడానికి అనీల్ రావిపూడి ‘ఎఫ్ 3’ ని వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ కు తీసుకు రావాలనే ఆలోచనలో ఆ ప్రాజెక్ట్ కథ గురించి నటీ నటుల ఎంపిక గురించి ఇప్పటి నుంచే ఆలోచనలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో కళ్యాణ్ రామ్ అనీల్ రావిపూడితో జరిపిన వ్యక్తిగత సమావేశం ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది. 

తెలుస్తున్న సమాచారం మేరకు కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమాను అనీల్ రావిపూడిని చేయమని కోరినట్లు తెలుస్తోంది. కథ సరిగ్గా సెట్ అయితే ఆ కథలో జూనియర్ నటించేలా తాను ఒప్పిస్తానని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే జూనియర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ మూవీ సెట్ అయిన పరిస్థితులలో ఇప్పుడు జూనియర్ సినిమాల లిస్టులో అనీల్ రావిపూడికి స్థానం ఎక్కడా అన్న సందేహాలు వస్తున్నాయి. 

దీనితో అనీల్ రావిపూడి తీయబోయే ‘ఎఫ్ 3’ లో తనకు కూడ ఒక హీరో రోల్ ఇమ్మని కళ్యాణ్ రామ్ అడిగి ఉంటాడు లేదంటే మరొక ప్రాజెక్ట్ విషయమై వీరిద్దరి మధ్య చర్చలు జరిగి ఉంటాయి అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి అనీల్ రావిపూడి కి తొలి అవకాశం ఇచ్చిన వ్యక్తి కళ్యాణ్ రామ్ కాబట్టి కళ్యాణ్ రామ్ ఒత్తిడికి ఎదో విధంగా అనీల్ రావిపూడి సహకరించి అతడి ఋణం తీర్చుకుంటాడు అన్న ఊహాగానాలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: