న‌టి అనిత.. గుర్తుందా..? అదేనండీ.. దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వు నేను’ చిత్రంతో ఉదయ్ కిరణ్ సరసన న‌టించిన‌ హీరోయిన్ అనిత. ఇప్పుడు వెంట‌నే గుర్తు వ‌స్తుంది. ఎందుకంటే ఆ సినిమా అంత హిట్ అయింది కాబ‌ట్టి. ఇక తొలి సినిమాతోనే తెలుగులో బ్లాక్ బస్టర్ అందుకుని ఇక్కడ వరుసగా సినిమాల్లో నటించేసింది. అయితే తెలుగులో సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తిరిగి ఉత్తరాదికి మకాం మార్చేసింది. థ్రిల్లర్ సినిమా కుచ్ తో హై ద్వారా హిందీ సినిమా రంగంలోకి ప్రవేశించింది. కళావర్ కింగ్ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించింది. 

 

ఇక సినిమాలు సెట్ కాకపోవడంతో పలు హిందీ సీరియళ్లలో నటించి మెప్పిస్తుంది. నాగిన్ 3 ధారావాహికతో బుల్లితెరపైనా పాపులర్ అయిన అనిత.. వ్యాపారవేత్త రోహిత్ శెట్టితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత రోహిత్ శెట్టి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే అనిత బుల్లితెర నిర్మాతలతో స్నేహం చేస్తూ ఉండ‌డంతో ఓ రేంజ్‌లో బుల్లితెర అవ‌కాశాలు తెచ్చిపెడుతున్నాయి. ఇక మ‌రోవైపు రెగ్యులర్ గా అనిత విదేశీ వెకేషన్ ఫోటోలు.. వీడియోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈ మ్యారీడ్ హాటీ మరోసారి బికినీతో చెలరేగిపోయింది. 

 

బులుగు జిలుగు సముద్రపు అంచులో నిలబడి నేవీ బ్లూ బికినీలో అనిత ఇచ్చిన ఫోజు మ‌తి పోగొడుతుంది. ఆ కళ్లకు రేబాన్ ధరించి అల్ట్రా పోష్ లుక్ లో వెర్రెక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటో యువతరం సోషల్ మీడియాల్లో జోరుగా వైరల్ అయిపోతోంది. ఏదేమైనా పెళ్లి త‌ర్వాత కూడా ఈ బ్యూటి బికినీ ఫోటోల‌తో కూర్ర‌కారు గుండెల్లో ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది. కాగా, ఇటీవ‌ల  ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు హల్ చల్ చేయగా.. ఆమె ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేస్తూ ఓ వీడియోను రూపొందించారు. అప్పుడు కూడా ఈమె ఫోటోలు తెగ వైర‌ల్ అయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: