‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని భారీ బడ్జెట్ తో తీస్తున్న పరిస్థితులలో ఈ మూవీకి సంబంధించి కేవలం బాలీవుడ్ బిజినెస్ ద్వారా 200 కోట్లకు పైగా రాబట్టాలని రాజమౌళి ఆలోచనలు చేస్తున్నాడు. అందుకోసమే ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ లో అలియా భట్ అజయ్ దేవగన్ లాంటి భారీ బాలీవుడ్ స్టార్స్ ను పెట్టుకున్నాడు. 

వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ లో వీలైనంత వరకు తక్కువ పాటలు పెట్టాలని మొదట్లో రాజమౌళి భావించాడు. అయితే ఈ సినిమా కథ రీత్యా వచ్చే పాటలు మాత్రమే కాకుండా చరణ్ జూనియర్ లపై వారి అభిమానుల కోసం కొన్ని పాటలు అదేవిధంగా మాస్ ప్రేక్షకుల కోసం ఒక ఐటమ్ సాంగ్ పెట్టవలసిన పరిస్థితి రాజమౌళికి ఏర్పడింది. 

దీనితో మంచి డాన్సర్ గా పేరున్న అలియా భట్ పై ఒక ప్రత్యేక సాంగ్ ఏమి లేకుండా పోయింది. దీనికితోడు ఈ మూవీ కథ రీత్యా అలియా భట్ పాత్ర చాల చిన్నది. దీనితో అలియా భట్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కేవలం ఆమె కోసం ఒక భారీ సెట్ వేసి ఆమె పై ఒక సాంగ్ ను చిత్రీకరించే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు సమాచారం. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో చిత్రీకరించబోతున్న ఈ పాట చాల డెకరేటివ్ గా అలియా ఇమేజ్ కి గ్లామర్ కు తగిన విధంగా బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రాజమౌళి ఈ సాంగ్ ను కంపోజ్ చేయిస్తున్నట్లు టాక్.

ఈ మూవీలో నటిస్తున్న అజయ్ దేవగన్ పాత్ర చిన్నది అయినప్పటికీ ఆ పాత్ర ఎలివేషన్ జూనియర్ చరణ్ పాత్రల కంటే ఎక్కువ అని ఇది అంతా బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రాజమౌళి అనుసరిస్తున్న వ్యూహాలు అని అంటున్నారు. అలియా భట్ కు ఇన్న సూపర్ హీరోయిన్ స్టేటస్ ను దృష్టిలో పెట్టుకుని ఆమె కోసం ఈ ప్రత్యేకమైన పాటను రాజమౌళి క్రియేట్ చేసి ఆమెకు ఈ మూవీలో తన పాత్ర తగ్గిపోవడం విషయం పై వచ్చిన కోపాన్ని సరి చేస్తున్నాడు అనుకోవాలి..  
 

మరింత సమాచారం తెలుసుకోండి: