రవితేజ కృష్ణ సినిమాలో బాబీ.. అంటూ బ్రహ్మానందంను మత్తుగా పిలుస్తూ.. ఓ రేంజ్ లో హిట్ కొట్టేసిన కరాటే కల్యాణి గుర్తుందిగా.. ఈ మధ్య సినిమా అవకాశాలు కాస్త తగ్గాయి లెండి.. రవితేజకే చెందిన మరో సినిమాలోనూ.. అబ్బ.. అంటూ చిత్రమైన మేనరిజంతో కామెడీ పండించిందీ కరాటే కల్యాణి. కాకపోతే.. ఈమె వివాదాల్లోనూ ముందే ఉంటుంది.

 

తాజాగా తనకు అసభ్య పదజాలంతో కామెంట్లు పంపుతూ... బూతు, మార్ఫింగ్ వీడియోలు పంపుతూ కొందరు తీవ్రంగా సతాయిస్తున్నారట. చిత్రహింసలు పెడుతున్నారట. ఈ విషయం ఆమే బయటపెట్టింది. అసలు ఉదయాన్నే ఫోన్ చూడాలంటేనే భయం వేస్తోందని సినీ నటి కళ్యాణి అలియాస్ కరాటే కళ్యాణి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు
ఫిర్యాదు చేసింది.

 

కొద్ది రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోన్ కు బూతు బొమ్మలు, బూతు మెస్సేజులు పంపుతున్నారంటూ ఆమె కొన్ని ఆధారాలు పోలీసుల ముందు ఉంచింది. పదే పదే బూతు బొమ్మలు పంపుతున్న వారి నెంబర్లు బ్లాక్ చేసినా.. వేరే నెంబర్ల నుంచి బూతు బొమ్మలు పంపుతూ విసిగిస్తున్నారని.. వేధిస్తున్నారని.. ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

 

తన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగేలా ప్రవరిస్తున్నారని, కొన్నింటిలో తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారని వాపోయింది. ఇలాంటి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సీసీఎస్ పోలీసులను కోరింది.

 

 

ఇంత వరకూ బాగానే ఉంది. తన వ్యక్తిగత గొడవ విషయంలో ఫిర్యాదు చేయడం వరకూ బాగానే ఉంది. కానీ ఇదే సమయంలో.. క్రైస్తవ సంఘాల ప్రతినిధుల పేరుతో కొద్దిరోజుల నుంచి కొందరు వ్యక్తులు హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా యూ ట్యూబ్, ఫేస్ బుక్ లో కథనాలు, వీడియోలు పెడుతున్నారని కరాటే కళ్యాణి పోలీసులకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: