దక్షిణాది సినిమా రంగానికి సంబధించి జపనీలు ఒక్క రజినీకాంత్ సినిమాలు తప్ప మరెవ్వరి సినిమాలను చూడరు. అలాంటి దేశంలో ప్రభాస్ ‘బాహుబలి’ కి విపరీతమైన ఆదరణ లభించడమే కాకుండా ప్రభాస్ కు వేల సంఖ్యలో జపాన్ లో అభిమానులు కూడ ఏర్పడ్డారు. ‘సాహో’ విడుదల సమయంలో ఆ సినిమాను చూడటానికి జపాన్ నుండి అభిమానులు ప్రత్యేకంగా హైదరాబాద్ రావడమే కాకుండా ప్రభాస్ ను కలవాలని వారంతా ప్రయత్నాలు కూడ చేసారు. 

అయితే ‘సాహో’ విడుదల రోజున ప్రభాస్ హైదరాబాద్ లో లేకపోవడంతో జపాన్ నుండి వచ్చిన తన అభిమానులను ప్రభాస్ కలవలేకపోయాడు. ‘సాహో’ఒక్క బాలీవుడ్ లో తప్ప మరెక్కడా విజయం సాధించక పోవడంతో ఆ మూవీని జపాన్ లో జపనీ భాష సబ్ టైటిల్స్ తో విడుదల చేసారు. అయితే ఈ సినిమాకు అక్కడ అనూహ్య స్పందన రావడమే కాకుండా ఈ మూవీని చూస్తూ హడావిడి చేస్తున్న జపాన్ దేశంలోని ప్రభాస్ అభిమానులకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దీనితో ప్రభాస్ గతంలో నటించి విజయవంతం అయిన కొన్ని సినిమాలను ఇదే విధంగా జపనీ భాష సబ్ టైటిల్స్ తో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు ప్రభాస్ కు వస్తున్నట్లు టాక్. ప్రభాస్ కు జపాన్ లో ఏర్పడిన మ్యానియాను చూసి అది కేవలం ‘బాహుబలి’ సినిమా పట్ల ఏర్పడిన అభిమానం కానీ అది ప్రభాస్ మ్యానియా కాదు అంటూ అప్పట్లో కామెంట్స్ వచ్చాయి. 

అయితే ఇప్పుడు ‘సాహో’ కి జపాన్ ప్రేక్షకులలో వస్తున్న ఆదరణ చూసిన వారికి మాత్రం రజినీకాంత్ తరువాత జపాన్ లో రియల్ ఫాలోయర్స్ ఉన్నది ప్రభాస్ కు మాత్రమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘సాహో’ ఘోర పరాజయం చెందినా బాలీవుడ్ లో అదేవిధంగా జపాన్ లో ఇలా ఊహించని సక్సస్ అందుకోవడం ప్రభాస్ కు ఒక స్వీట్ మెమరీ అనుకోవాలి..   

మరింత సమాచారం తెలుసుకోండి: