ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నమే వారెవా అనిపించిన డైరక్టర్ మారుతి కెరియర్ మొదట్లో అడల్ట్ కంటెంట్ సినిమాలు చేస్తూ అబాసు పాలైనా తనకున్న ఆ ఇమేజ్ మార్చేసుకుని ఇప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారాడు. 2019 చివర్లో వచ్చిన ప్రతిరోజూ పండుగే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మారుతిసినిమా తర్వాత నెక్స్ట్ ఎవరితో చేస్తే బాగుంటుందా అన్న ఆలోచనలో పడ్డాడు. అయితే ఫైనల్ గా తన తర్వాత సినిమా హీరోని పట్టుకున్నాడు. నాచురల్ స్టార్ నానితో మారుతి నెక్స్ట్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

 

క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కె.ఎస్ రామారావు ఈ సినిమా నిర్మిస్తారని ఫిల్మ్ నగర్ టాక్. మారుతి, నాని ఆల్రెడీ సూపర్ హిట్ కాంబో ఇది. భలే భలే మగాడివోయ్ సినిమాతో నాని కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన మారుతిసినిమా తర్వాత తన రేంజ్ కూడా పెంచుకున్నాడు. నానికి నాచురల్ స్టార్ స్క్రీన్ నేం ఇచ్చి మరి సూపర్ హిట్ ఇచ్చిన మారుతి మళ్లీ అతనితో సినిమా చేస్తున్నాడని తెలిసిన ప్రేక్షకులు ఖుషి అవుతున్నారు. అంతేకాదు ఒక హిట్టు రెండు ఫ్లాపులు అన్న విధంగా కెరియర్ సాగిస్తున్న మారుతికి సాయి తేజ్ సినిమా హిట్టు తర్వాత నాని దొరకడం కూడా లక్కీనే అని చెప్పొచ్చు.

 

నాని సినిమా అయితే సూపర్ హిట్ లేదంటే కనీసం పర్వాలేదు అయినా అనిపించుకుంటుంది. అందుకే నానితో జతకడుతున్న మారుతి నానికి మళ్లీ హిట్ ఇచ్చి తన ఖాతాలో కూడా మరో సూపర్ హిట్ వేసుకుంటాడని అంటున్నారు. ఈ సినిమా కథ ఏంటి..? మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరు..? అన్నది విషయాల మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నాని, మారుతి కాంబో సినిమా అంటే ఆ సినిమా పక్కా ప్రేక్షకులను మెప్పిస్తుందన్న టాక్ మాత్రం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: