‘బిగ్ బాస్ 3’ షోతో విజేత గా మారిన రాహుల్ కు వచ్చిన క్రేజ్ తో సమానంగా ఇదే షోలో రాహుల్ తో కలిసి ప్రేమాయణం సాగించిన పునర్నవి కి కూడ క్రేజ్ బాగా ఏర్పడింది. దీనితో ఈషో ముగిసిన తరువాత పునర్నవి తనకు బాగా అవకాశాలు సినిమాలలో వస్తాయని ఆమె భావించింది అని అంటారు.

అయితే ఈషో ముగిసి కొన్ని నెలలు అయిపోతున్నా ఆమెను ఇండస్ట్రీలోని ఏ దర్శక నిర్మాత పట్టించుకోకపోవడం ఆమెకు షాక్ ఇస్తున్నట్లు టాక్. దీనికితోడు ఒక చిన్న నిర్మాత రాహుల్ పునర్నవి లను కలిపి తీయాలి అని భావిస్తున్న సినిమా ప్రాజెక్ట్ కు రాహుల్ వైపు నుండి సహకారం లభించడం లేదు అన్న గాసిప్పులు కూడ హడావిడి చేస్తున్నాయి.

ప్రస్తుతం తన ఫిలిం ఎంట్రీని ఒక పెద్ద దర్శకుడు ద్వారా ఉండాలి అన్న ఆలోచనలతో రాహుల్ కృష్ణవంశీ ‘నటసామ్రాట్’ మూవీలో ఒక కీలక పాత్రను చేస్తున్నాడు. రమ్యకృష్ణ ప్రకాష్ రాజ్ లు నటిస్తున్న ఈ మూవీ పై మంచి అంచనాలు ఉన్నాయి. దీనితో పునర్నవి తో హీరోగా చేసే సినిమా గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు అని అంటారు.

ఈ సంఘటనతో ఇక లాభం లేదు అనుకున్న పునర్నవి లేటెస్ట్ గా యోగాసనాల ఫోటో షూట్‌ పేరుతో విపరీతంగా ఎక్స్ పోజ్ చేస్తూ యోగాలోని పలు రకాల ఆసనాలను వేసి చూపిస్తూ అందులో తాను ఎంతటి ట్యాలెంటెడ్ అనే విషయాన్ని చెప్పడానికి అనేక ప్రయత్నాలు చేసింది. అయితే ఈ ఫోటోలలో అందాల ఆరబోత మోతాదు దాటి పోవడంతో విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. కొంతమంది సినిమా ఛాన్సుల కోసం ఇలా చేస్తున్నావా అంటూ  అడుగుతుంటే యోగా ని అడ్డుపెట్టుకుని ఈ ఎక్స్ పోజింగ్ ఏమిటి అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. దీనితో అవకాశాలు రాలేదు కాని పునర్నవి పై అనవసరపు కామెంట్స్ వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: