పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి అర్ధం కాదు అని అనుకుంటారట కొందరు.. అందుకు తగ్గట్టుగా గబ్బర్ సింగ్ సినిమాలో నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అనే డైలాగ్ సరిగ్గా కుదిరిందనిపిస్తుంది.

 

 

ఎందుకంటే మొన్నటి వరకు రాజకీయ రగడల్లో రాటుతేలిన పవన్ కళ్యాణ్, గత కొంతకాలంగా కళామతల్లికి దూరంగా ఉంటున్నాడు. దీంతో అటు రాజకీయ భవిష్యత్తు, ఇటూ సినీ రంగంకు మధ్యలో బ్యాలన్స్ కాక పోవడం వల్ల కొన్ని కొన్ని అపవాదులు ఈ జనసేన చుట్టూ కంచెలా అళ్లుకున్నాయి.

 

 

ఇకపోతే పూర్తి రాజకీయాలకే తన జీవితం అంకితమని చెప్పిన పవన్ ఇప్పుడు సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాడు. ఈ దశలో పవర్ స్టార్ స్పీడ్ చూస్తుంటే ఎవరైనా షాక్ తినాల్సిందే. ఎందుకంటే ఒకదాని వెంట ఒకటిగా సినిమాల ముహూర్తాలు చేసేస్తూ… షూటింగులతో క్షణం తీరిక లేనంత బిజీ అయిపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

 

 

మొన్నటికి మొన్న ఇలా ‘పింక్’ రీమేక్ షూటింగ్ సైలెంటుగా మొదలు పెట్టేసిన పవన్… గుట్టుచప్పుడు కాకుండా నిన్న బుధవారం తన 27వ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించేయడం విశేషం. ఇక క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనున్నదని తెలుస్తుంది.

 

 

ఏ.ఎం.రత్నం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హిస్టారికల్ వారియర్ కథాంశం అన్న ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతోంది. అంతే కాకుండా పాన్ ఇండియా కేటగిరీలో అన్ని భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారని సమాచారం..

 

 

ఇకపోతే రెగ్యులర్ చిత్రీకరణను  ఫిబ్రవరి 4 నుంచి  ప్రారంభించి, హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో తొలి షెడ్యూల్‌ని తెరకెక్కించనున్నారని తెలుస్తుంది.. ఇక మీడియా పరంగా పవన్ పైన ఇన్ని వార్తలు వస్తున్నా, వీటిలో ఏది అధికారికంగా బయటపడక పోవడం ఇప్పుడు జనసేన ఫ్యాన్స్‌ను అసహనానికి గురిచేస్తుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: