ఒకప్పుడు రవితేజ సినిమా వస్తుంది అంటే మినిమం గ్యారంటీ అనుకునేవారు నిర్మాతలు... ఎంటర్టెన్మెంట్ గ్యారంటీ అనుకునేవారు ప్రేక్షకులు. ఏకంగా ప్రేక్షకులందరూ మాస్ మహారాజ్ గా కూడా రవితేజకు క్యాప్షన్ ఇచ్చారు. గతంలో రవితేజ ఖాతాలో  మంచి హిట్ సినిమాలు కూడా ఉన్నాయి.రవితేజ  సినిమా అంటే మినిమం వసూళ్లు గ్యారెంటీ అనుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం అలా లేదు. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ చేసిన ఒక్క సినిమా కూడా విజయం సాధించలేకపోయింది. ఇప్పటికే వరుసగా నాలుగు ఫ్లాపులతో సతమతమవుతున్నాడు రవితేజ. 

 


 తాజాగా డిస్కో రాజా  సినిమాతో విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ... అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ  సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన డిస్కో రాజా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో... రవితేజ తర్వాతి  సినిమాలపై పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్  సినిమా చేస్తున్నాడు. సినిమా తర్వాత వెంకటేష్ వరుణ్ తేజ్ లతో కలిసి ఎఫ్ 3 సినిమాలో  నటించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. కానీ డిస్కో రాజా డిజాస్టర్తో ఎఫ్ 3 సినిమా లోకి రవితేజను తీసుకోవద్దని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు తాజాగా టాలీవుడ్లో చర్చించుకుంటున్నారు. 

 


 ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాలో  రవితేజ కు బదులుగా మరో స్టార్ హీరోను తీసుకోవాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక రవితేజ ప్లేస్ లో  ఎవరిని తీసుకోబోతున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే.. హీరో రవితేజకు కాస్త గడ్డుకాలం ఏర్పడిందని చెప్పాలి.ఒక్క ఎఫ్ 3 సినిమానే కాదు ఇప్పటివరకు రవితేజ తో సినిమా చేయాలని అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు కూడా రవితేజతో సినిమా అంటే కాస్త వెనకడుగు వేస్తున్నారు. రవితేజ కు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వమనలేక  రవితేజతో సినిమా చేయలేక  నిర్మాతలందరూ అయోమయంలో పడిపోయారు అనే టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: