టాలీవుడ్ సినిమా పరిశ్రమకు దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన సొంతం అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నమిత. ఇక అప్పట్లో ఆ సినిమా బాగానే ఆడడంతో నమితకు నటిగా మంచి పేరు దక్కింది. అప్పట్లో ఎంతో సన్నగా నాజూగ్గా ఉన్న నమితకు ఆపై జెమినీ, జెమినీ, ఒకరాజు ఒకరని, బిల్లా, వంటి సినిమాల్లో మంచి అవకాశాలు దక్కాయి. అయితే కెరీర్ పరంగా నమితకు మాత్రం ఆమె ఊహించిన రేంజ్ సక్సెస్ అయితే దక్కలేదనే చెప్పాలి. ఇక మధ్యలో కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించిన నమిత

 

అక్కడ కూడా అంతగా పాపులర్ కాకపోవడంతో ఒకింత నిరాశ చెందింది. అయితే ఆమె ఆ తరువాత బాగా బొద్దుగా తయారవడంతో మెల్లగా వస్తున్న కొద్దిపాటి అవకాశాలు కూడా సన్నగిల్లాయి. అయినప్పటికీ కూడా ఏ మాత్రం తనపై తనకు ఉన్న ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లకుండా నమిత మెల్లగా తన శరీరాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు మొదలెట్టింది. ఇక ఇటీవల వివాహము చేసుకున్న తరువాత మరింత ఒళ్ళు రావడంతో, ఇకపై సన్నాబడాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఆమె చెప్పుకొచ్చింది. 

 

ఇకపోతే నేడు కొద్దిగా లావు తగ్గి లైట్ బ్లూ కలర్ శారీలో నమిత దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక ఆ ఫోటోలను చూసిన పలువురు నెటిజన్లు, మీకు వయసు వచ్చినా అందం మాత్రం తగ్గలేదు. ఇకపై మీకు సినిమాల్లో మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నట్లు పలువురు నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెళ్లి తరువాత తన భర్త తనకు అన్నివిధాలుగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకొచ్చిన నమిత, రాబోయే రోజుల్లో మరింతగా బరువు తగ్గి బాగా సన్నబడతాను అని అంటోంది. మరి ప్రస్తుతం కాస్త లావు తగ్గిన నమితకు రాబోయే రోజుల్లో ఎంత మేర అవకాశాలు వస్తాయో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: