నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల తన సినిమా కెరీర్ పరంగా వరుసగా పరాజయాలు ఎదుర్కొంటున్నారు. రెండేళ్ల క్రితం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన జైసింహా సినిమాతో యావరేజ్ విజయాన్ని అందుకున్న బాలయ్య. గత ఏడాది తన తండ్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి బయోపిక్ లు గా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో నటించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాలు రెండూ కూడా ఘోర పరాజయాన్ని అందుకుని నందమూరి ఫ్యాన్స్ ని నిరాశపరిచాయి. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రూలర్ సినిమా కూడా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. 

 

ఇక తప్పని ప్రస్థితుల్లో తనకు గతంలో సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్స్ అందించిన బోయపాటిని నమ్ముకున్నారు బాలయ్య. ఇకపోతే మరొకవైపు యువ హీరో నందమూరి యంగ్ ఎన్టీఆర్, వరుసగా మంచి సక్సెస్ఫుల్ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల త్రివిక్రమ్ సినివాస్ తో చేసిన అరవింద సమేత తో మంచి హిట్ అందుకున్న యంగ్ టైగర్, ప్రస్తుతం దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో ఒక హీరోగా నటిస్తున్నారు. ఇక తమ నందమూరి ఫ్యామిలీ అభిమానులతో పాటు, తన స్వంతగా కూడా అభిమానులను సంపాదించిన ఎన్టీఆర్, రేపు ఆర్ఆర్ఆర్ కనుక హిట్ సాధిస్తే మరింత గొప్ప పేరు దక్కించుకోవడం ఖాయం అనే చెప్పాలి. అయితే బాలయ్యకు వయసు మీద పడుతుండడంతో, 

 

ఆయన నట వారసుడిగా మోక్షజ్ఞ ను సినిమాల్లోకి తీసుకురావాలని చూస్తున్నప్పటికీ అతడికి మాత్రం ఆసక్తి లేదని టాక్. ఇక మొదటి నుండి జూనియర్ ని ఒకింత దూరం పెట్టిన బాలయ్య, ప్రస్తుతం తప్పని పరిస్థితుల్లో అతడికి దగ్గరవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా వ‌ట్టి పుకార్లే అని, కేవలం కొంద‌రు ఫ్యాన్స్ చేస్తున్న ప్ర‌చారం మాత్ర‌మే అని కొట్టిపారేస్తున్న వారు కూడా లేకపోలేదు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గాని, ఆ లోగుట్టు ఏంటో పెరుమాళ్ళకే ఎరుక.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: