టాలీవుడ్ హిస్టరీలో కల్ట్ మూవీస్ ని టచ్ చేసి మెప్పించడం ఒక్క నాగార్జున గట్స్ వల్లే కుదిరింది. శివ సినిమాతో ఈ జోనర్ కి టాలీవుడ్ లో బాగా పాపులారిటీ దక్కింది. ఆ తర్వాత ఆర్జీవీ కాంపౌండ్ ఇలాంటివి ఎన్నో సినిమాలు చేసిప్పటికి సక్సెస్ మాత్రం కాలేదు. అప్పట్లో వెంకటేష్ శ్రీదేవి లతో ఆర్జీవీ తెరకెక్కించిన క్లాసిక్ కల్ట్ మూవీ క్షణక్షణం సైతం బాక్సాఫీస్ వద్ద చతికిల బడింది. 

 

ఇక రీసెంట్‌గా కోలీవుడ్ లో వచ్చిన సినిమాల్లో 96 కూడా ఈ తరహాలో తెరకెక్కించిన సినిమానే. కోలీవుడ్ లో ఈ సినీమా కాసుల వర్షం కురిపించింది. అంతేకాదు త్రిష కి గ్రాండ్ గా రీ ఎంట్రీ మూవీగా మంచి పేరు తెచ్చింది. దాంతో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారు అనగానే అందరూ వద్దనే వాదించాఎరు. రకరకాల కామెంట్స్ చేసి డిసప్పాయింట్ చేశారు.  విజయ్ సేతుపతి-త్రిష జంటగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ లో సక్సస్ అయిన ఈ సినిమాను జాను టైటిల్ తో తెరకెక్కించి రిలీజ్ చేస్తున్నారు. తమిళ వెర్షన్ లో చేసిన విజయ్ పాత్రలో శర్వానంద్- త్రిష పాత్ర లో సమంత నటించారు.

 

'కాదలే కాదలే' ట్యూన్ తమిళ్ సహా తెలుగులో సంచలనం సృష్టించింది. కానీ జాను కోసం ఆ ట్యూన్ రీ క్రియేట్ చేసినా అసలు అంతగా బజ్ రాలేదు. తమిళ్ లో రిలీజ్ కు ముందే ఆ ఒక్క పాట సినిమాపై విపరీతమైన హైప్ తీసుకొచ్చింది. కానీ తెలుగులో మాత్రం ఎక్కడా వినిపించడం లేదు.

 

దీంతో సమంత-శర్వానంద్ ప్రచార బరిలో దిగి సినిమాకి బజ్ తీసుకు వచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఇక పాపం శర్వా ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు. కొన్నాళ్లు గా సరైన సక్సెస్ లేక ఎదురు చూస్తున్నాడు. జానులో నటించడానికి చాలా మంది యంగ్ హీరోలు ప్రయత్నించినప్పటికి చివరికి రాజు గారిని కన్వెన్స్ చేసి మరీ ఛాన్స్ దక్కించుకున్నాడు. మరి ఈ ప్రచారానికి సమాధానం దొరకాలంటే జాను సక్సస్ అయి చూపించాల్సిందే. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: