ఇప్పుడిప్పుడే టాలీవుడ్ చిత్రపరిశ్రమ బిజినెస్ పరంగా వంద కోట్లకు చేరుకుంటుంది. ఒక రకంగా ఇది శుభ పరిణామం అని చెప్పవచ్చూ. అంతే కాకుండా సినిమా బడ్జెట్ పెంచుకుంటూ, వసూలపరంగా కూడా పోటీ నెలకొంది. ఇలాంటి పరిస్దితిని తీసుకు వచ్చిన చిత్రం బాహుబలి. ఒకరకంగా టాలీవుడ్‌ను అంతర్జాతీయంగా నిలపెట్టిన చిత్రం ఇదని చెప్పవచ్చూ.

 

 

సినిమా ముందు వరకు యాభై లక్షలు దాటితే సంబరపడే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇప్పుడు ఒక సినిమా చిత్రీకరిస్తున్నప్పుడే వందకోట్ల క్లబ్బును దాటాలని ఆశిస్తున్నారు. కాని అన్ని సినిమాలకు ఆ అవకాశం దక్కడం లేదనుకోండి. ఇకపోతే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా దాదాపు వంద కోట్ల వసూళ్లతో రాణిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రతి హీరోకు ఏదో ఒక బలహీనత ఉంటుంది. వాటిని తెరవెనక మేనేజ్ చేయడం వల్ల హీరోల బలహీనతలు పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ వారి నటనను సరిగ్గా గమనిస్తే ప్రతి హీరోలో కొన్ని మైనస్ పాయింట్స్ కనిపిస్తాయి. అవేంటో ఒక లుక్కు వేద్దామా...!

 

 

మొదటగా బాలయ్య దగ్గరికి వస్తే సరైన కామెడీ టైమింగ్ లేకపోవడం ఒకే మ్యానరిజంతో బ్యాలన్స్ చేయడం.... ఇక మన మెగాస్టార్ చిరంజీవి, లెంగ్తీ డైలాగులలో తడబాటు... కింగ్ మాస్‌ను దడదడలాడించే కింగ్ నాగార్జునకు అసలు ఎమోషనల్ సీన్స్, చేయడం రాదట. ఇక పవర్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటుగా డాన్స్ లో కూడా వీక్... మరి ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న విక్టరీ వెంకటేష్ కు, రౌద్రంగా నటించడం రాదట, అలాగే డాన్స్ కూడా అంతగా అబ్బలేదు..

 

 

ఇక పవర్‌ఫుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఎమోషనల్ సీన్స్ ను అంతగా పండించడనే టాక్. ఇదే కాకుండా, డాన్స్ లో అంతంత మాత్రమే అని అనుకుంటున్నారట.. తన టైమింగ్ కామెడీతో పంచ్‌లు విసిరే మహేష్ బాబు పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో తడబాటు పడటమే కాదట ఈ సూపర్ స్టార్, డాన్స్ లో చాలా వీక్... ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్‌ను పిండటంలో తనకు తానే సాటి, కానీ రొమాంటిక్ సీన్స్, కామెడీ సీన్స్ ను పండించడంలో చేసే ప్రయత్నం అంతగా వర్కవుట్ అవ్వదటా..

 

 

ఇక అసలే బాహుబలి, ఇనుపముక్కల్లా ఉన్న డైలాగులను కూడా గుండుపిన్నులా వదిలే రెబల్ స్టార్ ప్రభాస్‌కు కూడా ఒక వీక్నెస్ ఉందట. అదేమంటే, హీరోయిన్లతో చేసే రొమాన్స్, ఎమోషన్ లో సీన్లలో కొద్దిగా తేలిపోవడం. ఇక రామ్ చరణ్ కు కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ మైనస్ అవ్వగా... కామెడీలో కంచు మోగినట్లుగా మోగిపోతున్న అల్లు అర్జున్ ఎమోషనల్ యాక్టింగ్ సరిగ్గా చేయలేడట. ఇకపోతే న్యాచురల్ స్టార్ నాని మాస్ రోల్స్ కి అంతగా సూట్ కాలేకపోవడం తెరపై సృష్టంగా కనిపిస్తుంది. చూసారా టాలీవుడ్‌ల్లో వెలిగిపోతున్న మన హీరోల బలహీనతలు.. కావాలంటే వీళ్ల సినిమాలు చూసేటప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: