ఈ మధ్య మెగాస్టార్ అన్నట్టు చెడు చెవిలో చెప్పాలి .. మంచి మైక్ లో చెప్పాలి. అలానే  విషయానికైనా నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా రెండు ముఖాలు ఉంటాయి. మంచి మాత్రమే కావాలి.. చెడు ఉండకూడదు, జరగకూడదు అంటే చెప్పుకోవడానికి, ఊహించుకోవడానికి బాగుంటుంది. కానీ నిజంగా అది జరగదు. సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్నిటికన్నా ఎక్కువగా నష్టాలు కూడా ఉన్నాయి, జరుగుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఎంత ఫ్రీ పబ్లిసిటీ వస్తుందో అంతకన్నా ఎక్కువ స్థాయిలో ట్రోలింగ్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. బాలీవుడ్ టాలీవుడ్, కోలీవుడ్ ఇల్లా నార్త్ సౌత్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా ఇందుకు తీసిపోవడం లేదు. వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ని తీసుకొచ్చి నెట్టింట్లో పెట్టేస్తున్నారు. అందుకే సీనియర్ నటి జీవిత తన పిల్లలను ట్రోలింగ్ చేయవద్దని కోరుతోంది... ఒకరకంగా చెప్పాలంటే వేడుకుంటోంది. ఎందుకంటే తనకున్నది ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి.

 

రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'చూసీ చూడంగానే'. ఈ సినిమా ఈవెంట్ రీసెంట్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి జీవిత ముఖ్య అథిదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవిత .. రాజ్ కందుకూరి గారు.. మథుర శ్రీధర్ రెడ్డి గారు తమ కుటుంబానికి సన్నిహితంగా ఉంటారని తెలిపారు. తనకు కూతుర్లు శివాని.. శివాత్మిక ఎంతో శివ కందుకూరి కూడా అంతేనని.. కొడుకు లాంటివాడని.. ఈ పిల్లల భవిష్యత్తు గురించి చాలా సార్లు తమ మధ్య చర్చలు జరిగాయని.. ఇప్పుడు శివ 'చూసీ చూడంగానే' సినిమాతో హీరోగా పరిచయం అవుతూ ఉండడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు జీవిత.

 

ఈ పిల్లలు ఎంతో ఆశతో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారని.. వారిని ప్రోత్సహించాలని మీడియా తో పాటు... సినిమా ప్రేక్షకులను కోరారు.  "సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం అన్నది గొప్పగా అనుకోకుండా దాన్ని పక్కనబెట్టి.. మా పిల్లలో మంచి ఏదో ఉందో అది చూపించి ఎంకరేజ్ చెయ్యండి.. దీవించండి" అంటూ జీవిత విజ్ఞప్తి చేశారు. జీవిత రిక్వెస్ట్ చేశారు కానీ నెటిజన్లు అలా ఊరుకునేవారు కాదు. నచ్చితే మెచ్చుకుంటారు.  లేకపోతే ముంచేస్తారు అన్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నే ట్రోలర్లు వదలడం లేదు.. ఇక సినిమా సెలబ్రిటీలను, చిన్న నటీ నటులను ఎలా వదిలేస్తారు ..! 

మరింత సమాచారం తెలుసుకోండి: