పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలపై న్యూస్ వస్తుందే గానీ..ఇంతవరకు నిర్మాతలు ప్రకటించలేదు. రెండు సినిమాలు లాంఛనంగా మొదలైనా.. సమాచారమే లేదు. ఎవరికి వాళ్లు తెలుసుకొని రాస్తున్నారే తప్ప.. నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి ఎనౌన్స్ మెంట్ లేదు. పవన్ కళ్యాణ్ తన సినిమాలను ఎందుకింత సీక్రెట్ గా ఉంచుతున్నాడు. 

 

అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమయ్యాడు. త్రివిక్రమ్ మాటల్లో చెప్పాలంటే.. గ్యాప్ రాలేదు. తీసుకున్నాడు. మళ్లీ నటిస్తున్నానని ఆయనే స్వయంగా ఎక్కడా చెప్పకపోయినా.. రీ ఎంట్రీ ఖాయమైందని కథనాలు వెలువడ్డాయి. రెండు సినిమాలు మొదలైనా.. నిర్మాణ సంస్థలు ప్రకటించలేదు. 

 

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ.. పది రోజుల క్రితమే.. హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ తో మొదలైంది. ఒకటి రెండు రోజులు షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంలో లీకైన ఫోటో తప్ప.. ఆయన నటిస్తున్న విషయాన్ని ఎవరూ కన్ఫార్మ్ చేయలేదు. బుధవారం మరో సినిమా లాంఛనంగా మొదలైంది. క్రిష్ దర్శకుడు. ఎ.ఎం రత్నం నిర్మాత. కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నా.. సినిమాకు సంబంధించిన ఒక్క విషయాన్ని కూడా  బయటపెట్టలేదు. 

 

పవన్ రెండు సినిమాలు చేస్తున్నా.. ఎందుకు ప్రకటించలేదు. అనే డౌట్ మెగా ఫ్యాన్స్ ను వెంటాడుతోంది. పవన్ హీరోనే కాదు.. జనసేన అధినేత కూడా. ఈ మధ్య రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. సినిమాకు సంబంధించిన ఒక్క విషయాన్ని కూడా బయటపెట్టొద్దని పవన్ హెచ్చరించాడట. సినిమా ప్రభావం రాజకీయాలపై పడకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడని సమాచారం. రీ ఎంట్రీ కాస్త లేటైనా.. ఎప్పుడూ లేనిది ఏకంగా రెండు సినిమా చేస్తూ.. ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇస్తున్నాడు పవన్ స్టార్. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఒకింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాడు. సైలెంట్ గా షూటింగ్ లకు జాయిన్ అవుతూ క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: