ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి మేకింగ్ స్టైల్ కాస్త డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఇత‌ర ద‌ర్శ‌కుల‌కు పూర్తి భిన్నంగా చిత్రాల‌ను తెరకెక్కిస్తుంటాడు రాజ‌మౌళి. ఇక ఇదిలా ఉంటే. సాధార‌ణ చిత్రాల‌కంటే కొంచం డిఫ‌రెంట్‌గా ఉంటుంది ఆయ‌న క‌థా క‌థ‌నాలు. ఆయ‌న స్టైల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు బాహుబ‌లి చిత్రంతో తెలుగు సినిమా స్థాయినే పెంచేశారు రాజ‌మౌళి. ఒక్క‌సారిగా హై బ‌డ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాగా చేశారు. మ‌నుషుల‌తోఏనే కాక‌ ఈగ‌తో కూడా అద్భుత‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించ‌వ‌చ్చ‌ని రాజ‌మౌళి ద్వారానే తెలిసింది. అంత గొప్ప‌ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. 

 

ఇక తెలుగులో కామెడీ, ల‌వ్‌, హార‌ర్‌, ఎమోష‌న‌ల్‌, ఇలా ర‌క ర‌కాల జోనర్స్‌లో సినిమాలు ఉంటాయి. కానీ రాజ‌మౌళి మాత్రం ఎక్కువ‌గా హాలీవుడ్ ఫార్ములాతో ఉండే క‌థ క‌థ‌నాలు స్క్రీన్‌ప్లే ఉండేలా చూసుకుంటారు. ఎక్కువ‌గా ఆయ‌న హాలీవుడ్ స్టైల్లో వెళుతుంటారు. ఇక ఈ విష‌యాన్ని న‌టుడు ఒక‌ప్ప‌టి హీరో సుమ‌న్ వ్యాఖ్యానించారు. అలాగే రాజమౌళి చిత్రాల్లో విలన్ రోల్స్ అద్భుతంగా ఉంటాయన్నారు. మొదట విలన్ డామినేట్ పాత్ర‌లుల‌ను రాస్తారు.  ఆ తర్వాత హీరోయిజం ఉండే పాత్ర‌లు ఎప్ప‌టికైనా స‌క్సెస్ ఫార్ములానే అని సుమన్ అన్నారు.

 

అలాగే తమిళంలో ద‌ర్శ‌కుడు శంకర్ కూడా దాదాపు అదే పంధాలో విల‌న్ పాత్ర‌ల‌ను తెర‌కెక్కిస్తార‌ని. ఎక్కువ‌గా అలాంటి పాత్రలే సృష్టిస్తారని.. అందుకే శివాజీలో విలన్ గా చేశానని.. తెలుగులో మాత్రం అలాంటి పవర్ ఫుల్ పాత్రలు నాకు రాలేదని సుమన్ చెప్పుకొచ్చాడు. విల‌న్‌గా మంచి ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్ ఎవ‌రైనా రాస్తే ఆయ‌న చేయ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్ప‌క‌నే చెప్పారు సుమ‌న్‌. రాజ‌మౌళి తెర‌కెక్కించే సినిమాల గురించి ఎంతో చ‌క్క‌గా చెప్పుకొచ్చారు హీరో సుమ‌న్‌. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ఆర్‌.ఆర్‌.ఆర్ చిత్రం షూటింగ్ బిజీలో ఉన్నారు. మొట్ట మొద‌టిసారి అంత పెద్ద హీరోలు మ‌ల్టీస్టారర్ తెర‌కెక్కుతుంది. ఫ్యాన్స్ అంద‌రూ ఆ చిత్రం గురించి ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: