‘అల వైకుంఠపురములో’ మూవీ ఇండస్ట్రీ టాప్ హిట్ గా మారడమే కాకుండా ‘బాహుబలి’ రికార్డుల తరువాత స్థానాన్ని ఆక్రమించడంతో ఈ మూవీ రికార్డులు ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశాలు లేవు. దీనికితోడు ఈ సమ్మర్ రేస్ లో ఒక్క పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ తప్ప మరి ఏ టాప్ హీరో సినిమా ఈ ఏడాది వచ్చే దసరా సీజన్ వరకు లేదు.

దీనితో అల్లు అర్జున్ కలక్షన్ రికార్డుల ఆదిపత్యం దసరా రేస్ కు విడుదల అయ్యే చిరంజీవి ప్రభాస్ ల సినిమాలు విడుదల అయ్యేదాకా కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. సమ్మర్ రేస్ కు పవన్ మూవీ ఉన్నా ఆ మూవీ ‘అల వైకుంఠపురములో’ స్థాయిలో సంచలనం సృష్టించడం కష్టం అని అంటున్నారు. ఇప్పుడే ‘అల’ సక్సస్ సంబరాల నుండి బయటకు వస్తున్న త్రివిక్రమ్ జూనియర్ తో తాను తీయబోయే కథ గురించి లోతుగా ఆలోచనలు చేస్తున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

‘అల’ మూవీ తరువాత త్రివిక్రమ్ ఏ సినిమాను చేసినా ఆ సినిమా పై చాల ఎక్కువ స్థాయిలో అంచనాలు ఉంటాయి. దీనితో అంత భారీ అంచనాలు అందుకోవడం త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ కు కూడ అంత సులువైన పని కాదు. ఇలాంటి పరిస్థితులలో త్రివిక్రమ్ మనసులో ఒక షాకింగ్ ఆలోచన వచ్చింది అన్న ప్రచారం జరుగుతోంది. జూనియర్ తో త్రివిక్రమ్ చేయబోయే సినిమా కథలో అత్యంత కీలకమైన తండ్రి పాత్ర పరిధి పెంచి ఆ పాత్రను బాలకృష్ణ చేత చేయిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలను త్రివిక్రమ్ తన సన్నిహితులతో పంచుకుంటున్నట్లు టాక్. 


వాస్తవానికి జూనియర్ తో త్రివిక్రమ్ తీయబోయే సినిమాను నిర్మించాలని కళ్యాణ్ రామ్ తో పాటు హారికా హాసిని సంస్థ కూడ ప్రయత్నాలు చేస్తోంది. దీనితో వీరిద్దరినీ భాగస్వాములుగా చేసి కళ్యాణ్ రామ్ ద్వారా తన ఆలోచనలను అటు బాలయ్యకు ఇటు జూనియర్ కు చేరవేసి వారి స్పందనను బట్టి అన్నీ కుదిరితే నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న బాలయ్య జూనియర్ కాంబినేషన్ సెట్ చేసి ‘అల’ స్థాయికి మించి కలక్షన్స్ ను రాబట్టాలి అని ఆలోచనలు చేస్తున్న త్రివిక్రమ్ కోరికకు బాలయ్య జూనియర్ ల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: