యువ హీరోల్లో తన రూటే సెపరేటు అన్నట్టుగా సినిమాలు చేస్తూ వస్తున్న నాగ శౌర్య తన లేటెస్ట్ సినిమా అశ్వద్ధామతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రమణ తేజ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో నాగ శౌర్య మదర్ ఉషా నిర్మించడం విశేషం. ఈ సినిమాలో నాగ శౌర్యకు జోడీగా మెహ్రీన్ కౌర్ నటించింది. యూఎస్ ప్రీమియర్స్ నుండి వచ్చిన ఫస్ట్ టాక్ ప్రకారం చూస్తే నాగ శౌర్య అశ్వద్ధామ ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు. సినిమా కథ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలానే ఉందని తెలుస్తుంది.

 

సడెన్ గా అమ్మాయిలు మిస్ అవడం.. ఆ తర్వాత వారు శవాలు గుర్తు తెలియని ప్లేస్ లో దొరకడం.. ప్రస్తుతం సమాజంలో ఆడవాళ్ల మీద జరుగుతున్న అఘాయిత్యాలను సినిమాలో చూపించారు నాగ శౌర్య. కంటెంట్ ఫుల్ సినిమాగా అనిపించినా కథ, కథనాలు రెగ్యులర్ సినిమాల మాదిరిగా ఉన్నట్టు అంటున్నారు. ఫస్ట్ హాఫ్ వరకు స్క్రీన్ ప్లే జస్ట్ ఓకే అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ కూడా అదే పంథా కొనసాగించినట్టు తెలుస్తుంది. 

 

ప్రస్తుతం సమాజంలో ఆడవాళ్ల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద హీరో నాగ శౌర్య స్వయంగా ఈ సినిమా కథ సిద్ధం చేయడం విశేషం. అయితే సినిమా ట్రైలర్ చూస్తే విషయం ఉన్నట్టుగానే అనిపించింది. ప్రీమియర్స్ నుండి ఎలాంటి టాక్ వచ్చినా అసలు టాక్ ఏంటన్నది తెలుగు రాష్ట్రాల్లో బొమ్మ పడ్డాకే తెలుస్తుంది. నాగ శౌర్య మాత్రం ఈ సినిమా మీద చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. రైటర్ గా ఛలో తర్వాత తన పెన్ పవర్ ఏంటో చూపించిన నాగ శౌర్యసినిమా సక్సెస్ అయితే రైటర్ గా కూడా కొనసాగేలా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: